Konda Surekha : సభలో పెట్టిన కులగణన సర్వే లెక్కలే అధికారికం: కొండా సురేఖ

by Y. Venkata Narasimha Reddy |

చట్ట సభలలో కంటే ముందుగా ప్లానింగ్ కమిషన్ కులగణన సర్వే నివేదిక లెక్కలను(Caste Census Survey Report) ప్రభుత్వం బయట(Outside No leak) ఎక్కడా వెల్లడించలేదని...ఈ రోజు సభలో పెట్టిన(In The House) నివేదికనే అసలైన అధికారిక సమాచారమని మంత్రి కొండా సురేఖ(Minister Konda Surekha)శాసన మండలిలో స్పష్టం చేశారు.

Konda Surekha : సభలో పెట్టిన కులగణన సర్వే లెక్కలే అధికారికం: కొండా సురేఖ
X

దిశ, వెబ్ డెస్క్ : చట్ట సభలలో కంటే ముందుగా ప్లానింగ్ కమిషన్ కులగణన సర్వే నివేదిక లెక్కలను(Caste Census Survey Report) ప్రభుత్వం బయట(Outside No leak) ఎక్కడా వెల్లడించలేదని...ఈ రోజు సభలో పెట్టిన(In The House) నివేదికనే అసలైన అధికారిక సమాచారమని మంత్రి కొండా సురేఖ(Minister Konda Surekha)శాసన మండలిలో స్పష్టం చేశారు. మండలిలో బీఆర్ఎస్ పక్షనేత జి.మధుసూధనచారి మాట్లాడుతూ 2014లో తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తొలినాళ్లలో ఆనాడు సమగ్ర కుటుంబ సర్వేకు ప్రజలు అపూర్వంగా స్పందించారన్నారు.

ఆ సర్వేతో పోల్చితో ప్రస్తుత కులగణన సర్వేలో 20లక్షలు తగ్గినట్లుగా తేలిందన్నారు. దీనిపై స్పందించిన మంత్రి కొండా సురేఖ సమాధానమిస్తూ ఇప్పటివరకు కులగణన సర్వే నివేదిక లెక్కలను బయట ఎక్కడా వెల్లడించలేదని..బయట ప్రచారంలో ఉన్న లెక్కల మేరకు బీసీ జనాభా శాతం తగ్గిందంటూ మాట్లాడం సరికాదని..ఈ రోజు సభలో ప్రభుత్వం పెట్టిందే అసలైన సమాచారమని కొండా సురేఖ చెప్పారు. డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క(Deputy CM Bhatti Vikramarka) జోక్యం చేసుకుని అసలు సమగ్ర కుటుంబ సర్వే అధికారికమే కాదని..అలాంటప్పుడు ఆ లెక్కలతో మేం సైంటిఫిక్ గా అధికారికంగా నిర్వహించిన కులగణన లెక్కలతో ఎలా పోల్చి చూస్తారని మధసూధనాచారిని ప్రశ్నించారు.

బీఆర్ఎస్ చేసినట్లుగా చెబుతున్న సమగ్ర కుటుంబ సర్వే లెక్కలను ప్రజలకు వెల్లడించలేదు..సభలో పెట్టలేదని అలాంటప్పుడు అది అధికారిక సమాచారం ఎలా అవుతుందని ప్రశ్నించారు. కులగణన సర్వేపై సూచనలు చేస్తే స్వీకరిస్తామన్నారు. సర్వే వాస్తవికంగా లేదన్న బీఆర్ఎస్ సభ్యుల అభ్యంతరాలను భట్టి త్రోసిపుచ్చారు. కులగణన సర్వే జరిగిన తీరున సమగ్రంగా సభకు ఏకరువు పెట్టారు. 3.56లక్షల ఇండ్లు సర్వేకు దూరంగా ఉన్నారని అందులో కేసీఆర్, హరీష్ రావు, కేటీఆర్, పల్లా రాజేశ్వర్ రెడ్డి వంటి వారు సర్వేలో పాల్గొనలేదన్నారు.

మరోవైపు మంత్రి కొండ సురేఖ మండలిలో చెప్పిన మాటలు..అంతకుముందు రోజున మీడియా సమావేశంలో కేబినెట్ సబ్ కమిటీ చైర్మన్ గా మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి చెప్పిన సర్వే లెక్కలు ఉత్తవేనని చెప్పినట్లుగా ఉందంటూ బీఆర్ఎస్ వర్గాలు ట్రోలింగ్ చేస్తుండటం విశేషం.

Next Story