నేటి నుంచి తెలంగాణలో కులగణన రీసర్వే

by Gantepaka Srikanth |

కులగణనలో ఇప్పటి వరకు నమోదు కానీ వారికి ప్రభుత్వం మరో అవకాశం కల్పించిన నేపథ్యంలో జీహెచ్ఎంసీ ఆధ్వర్యంలో ప్రత్యేక కాల్ సెంటర్ 040-21111111ను ఏర్పాటు చేశారు.

నేటి నుంచి తెలంగాణలో కులగణన రీసర్వే
X

దిశ, సిటీ బ్యూరో: కులగణనలో ఇప్పటి వరకు నమోదు కానీ వారికి ప్రభుత్వం మరో అవకాశం కల్పించిన నేపథ్యంలో జీహెచ్ఎంసీ ఆధ్వర్యంలో ప్రత్యేక కాల్ సెంటర్ 040-21111111ను ఏర్పాటు చేశారు. ఈ కాల్ సెంటర్ ఉదయం 9 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు పని చేస్తుంది. శనివారం కంప్యూటర్ ఆపరేటర్లకు కూకట్‌పల్లి జోనల్ కమిషనర్ అపూర్వ్ చౌహాన్ అవగాహన కల్పించారు. కాల్ సెంటర్‌లో ఆపరేటర్ ప్రవర్తించాల్సిన పద్దతిపై వివరించారు. ఈ కాల్ సెంటర్ జీహెచ్ఎంసీ పరిధితో పాటు ఇతర జిల్లాల నుంచి వచ్చిన కాల్స్ కూడా స్వీకరించి, అట్టి వివరాలను సంబంధిత జిల్లా కలెక్టర్లకు ఫార్వర్డ్ చేయాలని నిర్ణయించారు. అయితే కాల్ చేసే వ్యక్తి పూర్తి వివరాలు ఇవ్వాల్సి ఉంటుంది. ఫోన్ నంబర్, పూర్తి అడ్రస్, పిన్ కోడ్ నంబర్ తెలియజేయాల్సి ఉంటుంది.

నేటి నుంచి సర్వే..

కులగుణనలో నమోదు కాని వారి కోసం ప్రభుత్వం ఈ నెల 16 నుంచి 28 వరకు మరోసారి సర్వే కొనసాగిస్తున్నట్టు ప్రకటించిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో కాల్ సెంటర్ ద్వారా పేరు, వీధి, గ్రామం, మొబైల్ నంబర్, ఇంటి నంబర్, పట్టణాలలో అయితే సర్కిల్ లేదా వార్డు నంబర్ వివరించిన పక్షంలో అడ్రస్ ప్రకారం ఎన్యుమరేటర్ వారి ఇంటికి వెళ్లి కులగణన చేయనున్నారు. మొబైల్ నంబర్‌తో సెర్చ్ చేసి సంబంధిత వ్యక్తి పాత డేటా బేస్‌లో నమోదు అయ్యారా? లేదా వివరాలు ఉన్నాయా? అన్నది పరిశీలించి, లేని పక్షంలో సంబంధిత వ్యక్తి, పేరు, అడ్రస్ అడగనున్నారు. ముందుగా జీహెచ్ఎంసీనా? లేదా నాన్ జీహెచ్ఎంసీనా? అన్న వివరాలు అడగనున్నారు. జీహెచ్ఎంసీ పరిధి కానటువంటి వారైతే మున్సిపాలిటీ వార్డు నంబర్, అడ్రస్, గ్రామం అయితే మండలం అగడాలని నిర్ణయించారు. ఆయా వివరాలను తెలియజేసి పక్షంలో ఎన్యుమరెటర్ ఇంటి వద్దకు వచ్చి కుల సర్వే చేయనున్నారు. ఇప్పటి వరకు కులగణన సర్వేలో నమోదు చేసుకోని వారు ఇట్టి అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని జీహెచ్ఎంసీ అధికారులు సూచించారు.

Next Story