ఒకే రోజు 245 పైగా వాహనాలపై కేసులు నమోదు

by Ajay Maddhiboyina |

శుక్రవారం రాష్ట్ర వ్యాప్తంగా 245కు పైగా వాహనాలపై కేసులు నమోదు చేసినట్లు రవాణా శాఖ అధికారులు తెలిపారు. ఇందులో 180 వాహనాలను సీజ్ చేసినట్లు వెల్లడించారు. సీజ్ చేసిన వాటిలో 40 ఓవర్ లోడ్ తో తిరిగే వాహనాలున్నాయని తెలిపారు.

ఒకే రోజు 245 పైగా వాహనాలపై కేసులు నమోదు
X

దిశ, తెలంగాణ బ్యూరో: శుక్రవారం రాష్ట్ర వ్యాప్తంగా 245కు పైగా వాహనాలపై కేసులు నమోదు చేసినట్లు రవాణా శాఖ అధికారులు తెలిపారు. ఇందులో 180 వాహనాలను సీజ్ చేసినట్లు వెల్లడించారు. సీజ్ చేసిన వాటిలో 40 ఓవర్ లోడ్ తో తిరిగే వాహనాలున్నాయని తెలిపారు. మిగిలిన వాహనాలు ఫిట్ నెస్ లేనివి... టాక్స్, పర్మిట్ తదితర పత్రాలు లేని వాహనాలని ఆర్టీఏ పేర్కొంది. ఓవర్ లోడ్ తో తిరిగే వాహనాలను సీజ్ చేయడమే కాకుండా డ్రైవర్ డ్రైవింగ్ లైసెన్సు రద్దు చేస్తామని, పదేపదే ఉల్లంఘనలకు పాల్పడితే పర్మిట్ రద్దు చేస్తామని రవాణా శాఖ హెచ్చరించింది.

Next Story