- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
సంచలన ఆరోపణలు.. ప్రపంచ యాత్రికుడు నా అన్వేష్‌పై కేసు నమోదు
తెలుగు రాష్ట్రాల్లో బెట్టింగ్ యాప్స్ ను ప్రమోట్ చేస్తున్న సెలబ్రేటీలపై సోషల్ మీడియా వేదికగా అన్వేష్ అనే వ్యక్తి యుద్ధం చేస్తున్నాడు.

దిశ, వెబ్ డెస్క్: తెలుగు రాష్ట్రాల్లో బెట్టింగ్ యాప్స్ ను ప్రమోట్ చేస్తున్న సెలబ్రేటీలపై సోషల్ మీడియా వేదికగా అన్వేష్ అనే వ్యక్తి యుద్ధం చేస్తున్నాడు. చిన్న పెద్ద తేడా లేకుండా బెట్టింగ్ ప్రమోటర్స్ (Betting promoters) పై వీడియోలు చేస్తూ.. యువకులకు అవగాహన కల్పిస్తున్నారు. కాగా అలాంటి వ్యక్తిపై సైబరాబాద్ పోలీసులు (Cyberabad Police) కేసు నమోదు చేశారు. ఈ వ్యవహారం ఒక్కసారిగా అందరిని షాక్‌కు గురిచేసింది. అయితే ప్రపంచ యాత్రికుడిగా గుర్తింపు పొందిన నా అన్వేష్ (Anvesh) పై కేసు నమోదు చేయడానికి గల కారణాలు చాలా ఉన్నాయి.
ఇటీవల బెట్టింగ్ యాప్స్ పై వీడియోలు చేస్తూ.. సోషల్ మీడియాను షేక్ చేస్తున్న అతను.. హైదరాబాద్ మెట్రోలో బెట్టింగ్ యాప్ ప్రమోషన్ పై వరుస వీడియోలు చేశాడు. ఈ క్రమంలోనే డీజీపీ, మెట్రో ఎండీ ఎన్వీఎస్ఎస్ రెడ్డి తో పాటు, మాజీ సీఎస్ శాంతికుమారి, ఐఏఎస్ లపై కూడా బెట్టింగ్ యాప్స్ ప్రమోషన్స్ ఆరోపణలు చేశాడు. దీంతో ఊరుకోకుండా ఈ బెట్టింగ్ యాప్స్ ప్రమోషన్స్‌తో దాదాపు రూ. 300 కోట్లు కొట్టేశారని వారిపై తీవ్రమైన ఆరోపణలు (Allegations) చేస్తూ.. వీడియోలను పోస్ట్ చేశారు. ఈ వీడియోలపై స్పందించిన ఓ కానిస్టేబుల్.. నా అన్వేషనా తప్పుడు ప్రచారం చేస్తున్నాడని పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో అన్వేష్ పై సుమోటోగా కేసు నమోదు (Suomoto case registered) చేశారు. కాాగా ఈ కేసుపై నా అన్వేష్ ఏ విధంగా స్పందిస్తాడోనని నెటిజన్లు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.






