రూ.5 కోట్లు డిమాండ్ చేసిన ‘తీన్మార్’ రిపోర్టర్!.. భారీ షాకిచ్చిన బాధిత వ్యాపారి

by Gantepaka Srikanth |   (  Updated:2025-04-24 14:00:34  IST  )

తీన్మార్ మల్లన్న సంస్థ(Teenmar Mallanna Organization)లో పనిచేసిన రిపోర్టర్ శ్యామ్ వివాదంలో చిక్కుకున్నారు.

రూ.5 కోట్లు డిమాండ్ చేసిన ‘తీన్మార్’ రిపోర్టర్!.. భారీ షాకిచ్చిన బాధిత వ్యాపారి
X

దిశ, వెబ్‌డెస్క్: తీన్మార్ మల్లన్న సంస్థ(Teenmar Mallanna Organization)లో పనిచేసిన రిపోర్టర్ శ్యామ్ వివాదంలో చిక్కుకున్నారు. ఓ వ్యాపారవేత్త వద్ద రూ.5 కోట్లు డిమాండ్ చేసినట్లు సమాచారం. రూ.5 కోట్లు ఇవ్వాలని.. లేకపోతే తామేం చేయగలమో చూపిస్తామని బెదిరింపులకు దిగినట్లు తెలుస్తోంది. దీంతో చేసేదేంలేక బాధిత వ్యాపారి పోలీసులను ఆశ్రయించారు. రంగారెడ్డి జిల్లా రాజేంద్రనగర్ పోలీస్ స్టేషన్‌లో కంప్లైంట్ చేశారు. వెంటనే రంగంలోకి దిగిన పోలీసులు(Rajendranagar Police) సదరు రిపోర్టర్‌ను అదుపులోకి తీసుకున్నారు. అతనిపై దోపిడీ కేసు నమోదు చేశారు. గురువారం ఉప్పర్ పల్లి మెట్రోపాలిటన్ కోర్టులోని జడ్జీ ముందు ప్రవేశ పెట్టినట్లు తెలుస్తోంది. గత మూడు నెలల క్రితం వరకు తీన్మార్ మల్లన్న వద్ద పనిచేసిన ఆ రిపోర్టర్.. ప్రస్తుతం సొంతంగా ఛానల్‌ నడిపిస్తున్నట్లు సమాచారం. ఈ దీనికి సంబంధించిన పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

READ MORE ...

ఆ MLA మోసం చేశాడని మహిళ నా దగ్గరకు వచ్చింది.. రిపోర్టర్ శ్యామ్ వివరణ

రూ.5 కోట్లు డిమాండ్ చేసిన రిపోర్టర్ కేసులో BIG ట్విస్ట్.. ఏకంగా కాంగ్రెస్ ఎమ్మెల్యేనే టార్గెట్ చేశాడుగా..!


Next Story