- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
నిజామాబాద్ ఎంపీ అరవింద్‌పై కేసు నమోదు..
నిజామాబాద్‌లో మున్సిపల్ ఎన్నికల పోలింగ్ సందర్భంగా బీజేపీ ఎంపీ ధర్మపురి అర్వింద్ హల్‌చల్ చేశారు.

దిశ, డైనమిక్ బ్యూరో: నిజామాబాద్‌లో మున్సిపల్ ఎన్నికల పోలింగ్ సందర్భంగా బీజేపీ ఎంపీ ధర్మపురి అర్వింద్ హల్‌చల్ చేశారు. 34వ డివిజన్ హరిచరన్ మార్వాడి పోలింగ్ కేంద్రంలో పోలీసులు, ఎన్నికల సిబ్బందిపై అర్వింద్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. పోలింగ్ సిబ్బంది, పోలీసులపై దుర్భాషలాడినందుకు ఆయనపై కేసు నమోదు చేసినట్లు సమాచారం. కాగా, పోలింగ్ కేంద్ర వద్ద పోలీసోడికి ఒళ్ళు బలిసిందా? యూజ్లెస్ ఫెలోస్.. కళ్ళు నెత్తికి ఎక్కినయా పోలీసులకి? ఎవరైనా పోలీసోడు పోలింగ్ బూత్ నుండి బయటకు పంపితే తన్నుకుంటూ బయటకు తీసుకురా? పోలీసులపై, పోలింగ్ అధికారులపై బూతులతో రెచ్చిపోయారు. అయితే, బీజేపీ అభ్యర్థిని పోలీసులు బయటకు పంపించారని, ఎన్నికల సిబ్బంది తమకు సహకరించట్లేదని ఎంపీకి కార్యకర్తలు ఫిర్యాదు చేశారు. వెంటనే పోలింగ్ కేంద్రానికి చేరుకున్న ఎంపీ పోలీసులకు స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చారు.






