MP ఈటల రాజేందర్‌పై కేసు నమోదు

by Gantepaka Srikanth |   (  Updated:2025-01-21 17:35:29  IST  )

తెలంగాణ బీజేపీ(Telangana BJP) కీలక నేత, మల్కాజ్‌గిరి ఎంపీ ఈటల రాజేందర్‌(Etala Rajender)పై కేసు నమోదైంది.

MP ఈటల రాజేందర్‌పై కేసు నమోదు
X

దిశ, వెబ్‌డెస్క్: తెలంగాణ బీజేపీ(Telangana BJP) కీలక నేత, మల్కాజ్‌గిరి ఎంపీ ఈటల రాజేందర్‌(Etala Rajender)పై కేసు నమోదైంది. గ్యార ఉపేందర్ అనే వ్యక్తి ఇచ్చిన ఫిర్యాదు మేరకు పోచారం పోలీసులు(Pocharam Police) ఎఫ్‌ఐఆర్ ఫైల్ చేశారు. 126(2), 115(2), 352, 351(2), r/w 189(2), r/w 191(2) BNS యాక్ట్ ప్రకారం కేసులు నమోదు చేశారు. ఏకశిలా నగర్‌లో సెక్యూరిటీ డ్యూటీలో ఉండగా తన అనుచరులు 30 మందితో కలిసి వచ్చి ఎంపీ ఈటల రాజేందర్ తనపై దాడి చేశారంటూ బాధితుడు ఫిర్యాదులో పేర్కొన్నారు. కాగా, మంగళవారం మేడ్చల్‌ జిల్లా పోచారం మున్సిపాలిటీ పరిధిలోని ఏకశిలానగర్‌లో మంగళవారం రాజేందర్ ఈటల పర్యటించారు. బాధితుల ఫిర్యాదుతో స్థిరాస్తి దళారిపై ఈటల ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ క్రమంలో ఆయనపై చేయిచేసుకున్నారు. ఇంటి స్థలాల యజమానులను ఇబ్బంది పెడుతున్నారని ఎంపీ మండిపడ్డారు.

Next Story