- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
ఎన్నికల సిబ్బంది విధులకు ఆటంకం.. జగ్గారెడ్డిపై కేసు నమోదు
కాంగ్రెస్ సీనియర్ నేత, మాజీ ఎమ్మెల్యే జగ్గారెడ్డిపై సంగారెడ్డి పోలీసులు తాజాగా కేసు నమోదు చేశారు.

దిశ, వెబ్‌డెస్క్: కాంగ్రెస్ సీనియర్ నేత, మాజీ ఎమ్మెల్యే జగ్గారెడ్డిపై సంగారెడ్డి పోలీసులు తాజాగా కేసు నమోదు చేశారు. ఎన్నికల విధుల్లో ఉన్న సిబ్బందిని అడ్డుకోవడమే కాకుండా, వారి విధులకు తీవ్ర ఆటంకం కలిగించారనే ఆరోపణలతో బీఎస్ఎస్ యాక్ట్ 223, 351, 352, 132, 329 సెక్షన్ల కింద కేసు బుక్ చేసినట్లుగా పోలీసులు వెల్లడించారు. బుధవారం జరిగని మున్సిపల్ ఎన్నికల పోలింగ్ నేపథ్యంలో సంగారెడ్డిలోని పలు పోలింగ్ కేంద్రాల వద్ద ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. 34వ వార్డులోని ఒక పోలింగ్ కేంద్రం వద్ద విధుల్లో ఉన్న పోలీసు అధికారులతో జగ్గారెడ్డి వాగ్వాదానికి దిగారు. అక్కడి సీఐ, కాంగ్రెస్ అభ్యర్థి పట్ల అనుచితంగా ప్రవర్తించారని ఆరోపిస్తూ జగ్గారెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ క్రమంలో ఎన్నికల సిబ్బందిని మరియు పోలీసులను విధులను నిర్వహించనీయకుండా అడ్డుకున్నారని అధికారులు గుర్తించారు.
ఎన్నికల సంఘం సీరియస్..
ఈ ఘటనపై జిల్లా ఎన్నికల యంత్రాంగం నివేదికను పరిశీలించిన కేంద్ర ఎన్నికల సంఘం (ECI), దీనిని తీవ్రంగా పరిగణించింది. నిబంధనలను ఉల్లంఘించినందుకు మరియు ప్రభుత్వ సిబ్బందిని భయభ్రాంతులకు గురిచేసినందుకు గానూ ఆయనపై వెంటనే కేసు నమోదు చేయాలని ఆదేశించింది. ఈ మేరకు సంగారెడ్డి పోలీసులు బీఎన్ఎస్ యాక్ట్‌లోని పలు సెక్షన్ల కింద కేసు ఫైల్ చేసి దర్యాప్తు ప్రారంభించారు.






