మాజీ ఎమ్మెల్యే బాల్క సుమన్‌పై కేసు నమోదు

by Gantepaka Srikanth |

మంత్రి వివేక్ వెంకటస్వామి కాన్వాయ్‌పై దాడి కేసులో బీఆర్ఎస్ నేత, చెన్నూరు మాజీ ఎమ్మెల్యే బాల్క సుమన్‌పై కేసు నమోదైంది.

మాజీ ఎమ్మెల్యే బాల్క సుమన్‌పై కేసు నమోదు
X

దిశ, వెబ్‌డెస్క్: మంత్రి వివేక్ వెంకటస్వామి కాన్వాయ్‌పై దాడి కేసులో బీఆర్ఎస్ నేత, చెన్నూరు మాజీ ఎమ్మెల్యే బాల్క సుమన్‌పై కేసు నమోదైంది. పోలీసుల విధులకు ఆటంకం కలిగించడంతో పాటు రాళ్లతో దాడికి తెగబడ్డారని ఎస్ఐ గంగారం ఫిర్యాదు మేరకు బాల్క సుమన్‌తో పాటు పలువురు బీఆర్ఎస్ నేతలపై కేసు నమోదైంది.

ఇదిలా ఉంటే.. మంచిర్యాల జిల్లా క్యాతనపల్లి మున్సిపాలిటీ చైర్మన్, వైస్ చైర్మన్ ఎన్నిక రసాభాసగా మారింది. ఎక్స్ అఫీషియో హోదాలో తమ ఓటు హక్కు వినియోగించుకోవటానికి క్యాతనపల్లి చేరుకున్న మంత్రి వివేక్ వెంకటస్వామి, పెద్దపల్లి కాంగ్రెస్ ఎంపీ వంశీ కాన్వాయ్‌పై రాళ్లదాడి జరిగింది. బీఆర్ఎస్ పార్టీ మద్దతుదారులు రాళ్లతో దాడి చేశారు. ఈ దాడిలో మంత్రి వివేకా కారు అద్దాలు ధ్వసం అయ్యాయి. పరిస్థితి అదుపు తప్పటంతో పోలీసులు లాఠీచార్జి చేసి వారిని చదరగొట్టారు. ఈ ఘటనలో పలువురు కాంగ్రెస్ కార్యక్తర్తలు తీవ్రంగా గాయపడ్డారు.

Next Story