- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
Hit and Run: బైక్‌ను ఢీ కొట్టి పరార్.. బిగ్‌బాస్ ఫేమ్, ప్రముఖ నటిపై కేసు నమోదు
బిగ్ బాస్ ఫేమ్, ప్రముఖ నటి దివ్య సురేష్ వివాదంలో చిక్కుకుంది.

దిశ, డైనమిక్ బ్యూరో: కన్నడ బిగ్ బాస్ ఫేమ్, ప్రముఖ నటి దివ్య సురేష్ (Divya Suresh) వివాదంలో చిక్కుకుంది. ఈ నెల ప్రారంభంలో బెంగుళూర్లో బైక్‌ను ఢీ కొట్టి ఆపకుండా అక్కడి నుంచి పరార్ అయినట్లు ఆరోపణల నేపథ్యంలో ఆమెపై హిట్ అండ్ రన్ కేసు (Hit and run case) నమోదు అయింది. వివరాల్లోకి వెళితే.. అక్టోబర్ 4 తెల్లవారుజామున 1:30 గంటల ప్రాంతంలో బైతరాయణపురలోని నిత్య హోటల్ సమీపంలో ప్రమాదం జరిగింది. నటి దివ్య కారు ఓ బైకును ఢీ కొట్టి ఆగకుండా వెళ్లిపోయింది. ఈ ఘటనలో బైక్‌పై ఉన్న ఇద్దరు మహిళలకు గాయాలయ్యాయి. ఈ క్రమంలో వారి సమీప బంధువు కిరణ్ స్థానిక పోలీసులకు ఫిర్యాదు చేశారు.
పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదులో తన బంధువులు అనూష (33), అనిత (24)తో కలిసి బైక్‌పై వెళ్తుండగా, ఒక వేగంగా వెళ్తున్న నలుపు రంగు కారు వెనుక నుంచి ఢీకొట్టిందని తెలిపారు. ఢీ కొట్టడంతో వారు రోడ్డుపై పడిపోయారు. ఈ ఘటనలో అనితకు తీవ్రంగా గాయపడి ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. మరో యువతి అనుషకు స్వల్ప గాయాలు అయ్యాయని తెలిపారు. కిరణ్ పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదులో, అనిత చికిత్సలో తాను బిజీగా ఉండటంతో ఫిర్యాదు చేయడంలో ఆలస్యం అయిందని తెలిపారు. బైతరాయణపురం పోలీసులు నటిపై కేసు నమోదు చేశారు. ఆమెకు విచారణ కోసం నోటీసులు జారీ చేయనున్నామని పోలీసులు తెలిపారు. పలు సీసీటీవీ కెమెరాల్లో రికార్డు అయిన ఫుటేజ్‌లో కారు బైక్‌ను ఢీకొట్టి పారిపోతున్న దృశ్యాలు ఉన్నాయని, ఆ కారు రిజిస్ట్రేషన్ నెంబర్ ద్వారా దివ్య సురేష్ వాహనమని అధికారులు దృవీకరించారు. ప్రస్తుతం కేసు దర్యాప్తు కొనసాగుతోంది.






