- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
HMDA మాజీ డైరెక్టర్ బాలకృష్ణపై కేసు నమోదు
HMDA మాజీ డైరెక్టర్ బాలకృష్ణపై కేసు నమోదైంది. పలు సెక్షన్ల కింద గురువారం ఎఫ్ఐఆర్ ఫైల్ చేసినట్లు ఏసీబీ అధికారులు స్పష్టం చేశారు.

దిశ, వెబ్‌డెస్క్: HMDA మాజీ డైరెక్టర్ బాలకృష్ణపై కేసు నమోదైంది. పలు సెక్షన్ల కింద గురువారం ఎఫ్ఐఆర్ ఫైల్ చేసినట్లు ఏసీబీ అధికారులు స్పష్టం చేశారు. ఈ సందర్భంగా ఏసీబీ అధికారులు మాట్లాడుతూ.. బాలకృష్ణ ఇంటితో పాటు 16 ప్రదేశాల్లో తనిఖీలు చేశామని తెలిపారు. మొత్తంగా బాలకృష్ణ ఇంట్లో రూ.99.60 లక్షల నగదును సీజ్ చేసినట్లు స్పష్టం చేశారు. అంతేకాదు.. 1988 గ్రాముల బంగారం, 6 కేజీల సిల్వర్‌ను స్వాధీనం చేసుకున్నట్లు వెల్లడించారు. రూ.8.26 కోట్ల విలువైన ఆస్తుల పత్రాలు కూడా స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు.
ఇంకా ఆయన బినామీలపై విచారణ చేయాల్సి ఉందని ప్రకటించారు. ఇవాళ తెల్లవారుజామున 3 గంటలకు బాలకృష్ణను ఏసీబీ అధికారులు అరెస్ట్ చేసిన విషయం తెలిసిందే. రేపు న్యాయస్థానం ముందు హాజరుపరుస్తామన్నారు. కొన్ని విషయాలు ఆయన చెప్పలేదు.. మా విచారణకు సహకరించలేదని, కస్టడీలోకి తీసుకుంటే మరిన్ని విషయాలు తెలిసే అవకాశం ఉంటుందన్నారు.






