దర్శకుడు RGV, యాంకర్ స్వప్నపై కేసు నమోదు

by Ajay Maddhiboyina |   (  Updated:2025-10-18 08:16:35  IST  )

టాలీవుడ్ డైరెక్టర్ రామ్ గోపాల్ వర్మ, యాంకర్ స్వప్నలపై కేసు నమోదైంది. ఓ టీవీ ఛానెల్ ఇంటర్వ్యూలో హిందూ దేవుళ్లను కించపరుస్తూ రామ్ గోపాల్ వర్మ మాట్లాడనని ఏపీకి చెందిన మేడా శ్రీనివాస్ అనే వ్యక్తి పోలీసులకు ఫిర్యాదు చేశాడు.

దర్శకుడు RGV, యాంకర్ స్వప్నపై కేసు నమోదు
X

దిశ, వెబ్ డెస్క్: టాలీవుడ్ డైరెక్టర్ రామ్ గోపాల్ వర్మ, యాంకర్ స్వప్నలపై కేసు నమోదైంది. ఓ టీవీ ఛానెల్ ఇంటర్వ్యూలో హిందూ దేవుళ్లను కించపరుస్తూ రామ్ గోపాల్ వర్మ మాట్లాడనని ఏపీకి చెందిన మేడా శ్రీనివాస్ అనే వ్యక్తి పోలీసులకు ఫిర్యాదు చేశాడు. రామ్ గోపాల్ వర్మతో పాటు అతడిని ఇంటర్వ్యూ చేసిన యాంకర్ స్వప్నపై సైతం రాజమండ్రి పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశాడు. ఇదిలా ఉంటే ఆర్జీవీ ఒకప్పుడు బ్లాక్ బస్టర్ సినిమాలు చేసి టాలీవుడ్ లో స్టార్ డైరెక్టర్ గా ఎదిగారు.

తరవాత బాలీవుడ్‌కు వెళ్లి సర్కార్ లాంటి సినిమా దేశవ్యాప్తంగా అభిమానులను సంపాదించుకున్నాడు. కానీ తరవాత కాలంలో సరైన హిట్ ఒక్కటి కూడా పడలేదు. చివరగా ఆర్జీవీ డైరెక్షన్ లో వచ్చిన రక్తచరిత్ర సినిమా ప్రేక్షలను ఆకట్టుకుంది. తరవాత కూడా కొన్ని సినిమాలు చేసినా అవి వివాదాస్పద చిత్రాలుగా నిలిచాయి తప్ప విజయం సాధించలేదు. ఇక ఇప్పటికే ఆయన పలు రాజకీయ వివాదాల కారణంగా కేసులు నమోదవ్వగా ఇప్పుడు మరో కేసు నమోదైంది.

Next Story