Case Filed: మాజీ మంత్రి హరీశ్ రావుకు బిగ్ షాక్.. మరో కేసు నమోదు

by Kema Shiva Kumar |   (  Updated:2025-02-28 07:55:07  IST  )

సిద్దిపేట్ బీఆర్ఎస్ ఎమ్మెల్యే, మాజీ మంత్రి హరీశ్‌రావు (Harish Rao) తాజాగా మరో కేసు నమోదైంది.

Case Filed: మాజీ మంత్రి హరీశ్ రావుకు బిగ్ షాక్.. మరో కేసు నమోదు
X

దిశ, వెబ్‌డెస్క్: సిద్దిపేట్ బీఆర్ఎస్ ఎమ్మెల్యే, మాజీ మంత్రి హరీశ్‌రావు (Harish Rao) తాజాగా మరో కేసు నమోదైంది. చక్రధర్‌ గౌడ్‌ (Chakradhar Goud) అనే వ్యక్తి ఫిర్యాదు మేరకు నగరంలోని బాచుపల్లి (Bachupally) పోలీసులు ఆయనపై 351(2) R/W3, (5) BNS సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు. మాజీ మంత్రి హరీశ్ రావు (Harish Rao)తో పాటు మరో ముగ్గురి నుంచి తనకు ప్రాణహాని ఉందని, నిత్యం చంపేస్తామంటూ బెదిరిస్తున్నారని చక్రధర్‌గౌడ్‌ (Chakradhar Goud) ఆ ఫిర్యాదులో పేర్కొన్నారు. దీంతో బాచుపల్లి పోలీసులు ఎఫ్ఐఆర్‌ (FIR)లో A1గా వంశీకృష్ణ, A2గా హరీశ్‌రావు (Harish Rao), A3గా సంతోష్‌ కుమార్‌ (Santhosh Kumar), A4గా రాములు (Ramulu), A5గా వంశీ (Vamsi) పేర్లను చేరుస్తూ కేసు నమోదు చేశారు. హరీశ్ రావు మినహా కేసులు నమోదైన వాళ్లంతా ఇటీవలే జైలు నుంచి విడుదలైనట్లుగా తెలుస్తోంది. కేసుకు సంబంధించి పూర్తి వివరాలు ఇంకా తెలియాల్సి ఉంది.

Next Story