సెటిల్‌మెంట్లకు కేరాఫ్ కవిత.. హరీశ్‌రావు అనుచరుల సంచలన ఆరోపణలు

by Kema Shiva Kumar |   (  Updated:2025-09-02 13:17:08  IST  )

సెటిల్‌మెంట్లకు కేరాఫ్ కల్వకుంట్ల కవిత అని మాజీ మంత్రి హరీశ్‌రావు అనుచరులు సంచలన ఆరోపణలు గుప్పించారు.

సెటిల్‌మెంట్లకు కేరాఫ్ కవిత.. హరీశ్‌రావు అనుచరుల సంచలన ఆరోపణలు
X

దిశ, డైనమిక్ బ్యూరో: సెటిల్‌మెంట్లకు కేరాఫ్ కల్వకుంట్ల కవిత అని మాజీ మంత్రి హరీశ్‌రావు అనుచరులు సంచలన ఆరోపణలు గుప్పించారు. ఇవాళ సిద్దిపేట్ నియోజకవర్గంతో పాటు ఉమ్మడి మెదక్ జిల్లా, రాష్ట్రంలోని బీఆర్ఎస్ శ్రేణులు సోషల్ మీడియాలో కవితపై అప్రకటిత యుద్ధాన్ని ప్రకటించారు. కాళేశ్వరంలో హరీశ్ రావు మోసాలకు పాల్పడ్డారంటూ చేసిన వ్యాఖ్యలపై ఓ రేంజ్‌లో కౌంటర్ అటాక్ చేస్తున్నారు. ఎమ్మెల్సీగా ఉన్న కవిత.. పదేళ్ల బీఆర్ఎస్ పాలనలో అవినీతి, అక్రమాల్లో ఆరితేరారని కామెంట్ చేశారు. దేశ రాజధాని ఢిల్లీలో అనేక దందాలకు పాల్పడిందని ఆరోపించారు. అవినీతి డబ్బును కాపడుకునేందుకే రేవంత్ రెడ్డితో నిర్మొహమాటంగా చేయి కలిపిందని ఫైర్ అయ్యారు. కవిత వెనుక చంద్రబాబు, రేవంత్ ఉన్నారని బాంబు పేల్చారు.

Read More..

కవిత పార్టీలో ఉంటే ఎంత.. పోతే ఎంత: మాజీ మంత్రి సత్యవతి రాథోడ్

Next Story