- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
క్షణాల్లో నంబర్ ప్లేట్ తారుమారు.. HYD డ్రంక్ అండ్ డ్రైవ్ తనిఖీల్లో అడ్డంగా బుక్కయిన BMW కారు
జూబ్లీహిల్స్ డ్రంక్ అండ్ డ్రైవ్‌లో దొరికిన కిలాడీ కారు. రిమోట్ నొక్కితే టీజీ నుంచి ఢిల్లీ నంబర్‌గా మారే వింత టెక్నాలజీ చూసి పోలీసులు షాక్!

దిశ, డైనమిక్ బ్యూరో: ట్రాఫిక్ రూల్స్ అతిక్రమించి రోడ్లపై వెళ్లే వాళ్లు.. ట్రాఫిక్ చలాన్ల నుంచి తప్పించుకునేందుకు రకరకాల ప్రయత్నాలు చేస్తుంటారు. ఇక డ్రంక్ అండ్ డ్రైవ్ చేసే వారి సంగతి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. పోలీసులకే చుక్కలు చూపిస్తుంటారు. తాజాగా హైదరాబాద్ జూబ్లీహిల్స్ పలిధిలో నిర్వహించిన డ్రంక్ అండ్ డ్రైవ్ లో తన కారుకు టెక్నాలజీ ఉపయోగించి అతి తెలివి ప్రదర్శిస్తున్న ఓ వ్యక్తి పోలీసులకు అడ్డంగా దొరికిపోయాడు. శనివారం రాత్రి జూబ్లీహిల్స్ పరిధిలో పోలీసులు డ్రంక్ అండ్ డ్రైవ్ తనిఖీలు నిర్వహిస్తున్నారు. ఈ క్రమంలో ఒక బీఎండబ్ల్యూ కారును ఆపి డ్రైవర్‌ను తనిఖీ చేయగా అతను మద్యం సేవించి ఉన్నట్లు తేలింది. ఈ క్రమంలో అతడు ప్రయాణిస్తున్న కారును క్షుణ్ణంగా పరిశీలించగా పోలీసులకు ఒక వింత టెక్నాలజీ కనిపించింది.
క్షణాల్లో టీజీ టు ఢిల్లీ:
ఆ కారుకు అమర్చిన నంబర్ ప్లేట్ అసాధారణంగా ఉంది. కారు లోపల ఉన్న ఒక రిమోట్ లేదా బటన్ నొక్కగానే క్షణాల్లో నంబర్ ప్లేట్ మారిపోతోంది. నంబర్ ప్లేట్ వెనక్కి వెళ్ళిపోయి, దాని స్థానంలో మరో నంబర్ ప్లేట్ కనిపించేలా ఫ్లిప్పింగ్ మెకానిజం (Flipping Mechanism) చూసి పోలీసులు విస్తుపోయారు. తొలుత TG 9 FQ 9999 నంబర్ ప్లేట్ క్షణాల్లో DL 6 CM 7097 గా మారిపోయింది. ఈ నంబర్ చేంజ్ కు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. అయితే ఈ టెక్నాలజీ కేవలం డ్రంక్ అండ్ డ్రైవ్ నుంచి తప్పించుకోవడానికే ఉపయోగిస్తున్నాడా లేక ఏదైనా నేరాలకు పాల్పడటానికి ఈ టెక్నాలజీని వాడుతున్నాడా అనే సందేహాలు వ్యక్తం అవుతున్నాయి.






