అన్నోజిగూడ ఫ్లైఓవర్ పై కారు దగ్ధం.. ప్రమాదానికి కారణం ఇదే..!

by Ramesh Goud |

ఫ్లైఓవర్ పై కారు (Car) దగ్ధం (Burnt) అయిన ఘటన మేడ్చల్ జిల్లా (Medchal district) పోచారం మున్సిపాలిటీ (Pocharam municipality) పరిధిలో చోటు చేసుకుంది.

అన్నోజిగూడ ఫ్లైఓవర్ పై కారు దగ్ధం.. ప్రమాదానికి కారణం ఇదే..!
X

దిశ, వెబ్ డెస్క్: ఫ్లైఓవర్ పై కారు (Car) దగ్ధం (Burnt) అయిన ఘటన మేడ్చల్ జిల్లా (Medchal district) పోచారం మున్సిపాలిటీ (Pocharam municipality) పరిధిలో చోటు చేసుకుంది. సిద్దిపేట జిల్లా (Siddipet district) కొమురవెల్లి (Komuravelli)లో జరుగుతున్న మల్లన్న జాతరను తిలకించేందుకు హైదరాబాద్ (Hyderabad) పాత బస్తీ (Old City) నుంచి నలుగురు స్నేహితులు కారులో బయలుదేరారు. పోచారం సమీపంలోని అన్నోజీ గూడ ఫ్లైఓవర్ (Annoji Guda flyover) మీదికి రాగానే కారులో అకస్మాత్తుగా మంటలు చెలరేగాయి. దీంతో అప్రమత్తమైన యవకులు కారును పక్కకు నిలిపి పరుగులు తీశారు. మంటలు కారు మొత్తం వ్యాపించి అందరూ చూస్తుండగానే పూర్తిగా దగ్ధం అయ్యింది. అదృష్టవశాత్తు నలుగురు యువకులకు (four youths) ఎటువంటి ప్రమాదం జరగలేదు. ఘటనపై సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకొని ఫ్లైఓవర్ పై ట్రాఫిక్ ను నిలిపివేశారు. ప్రమాదానికి షార్ట్ సర్క్యూటే (short circuit) కారణమని పోలీసులు అనుమానిస్తున్నారు. ఘటనపై కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేపడతామని వెల్లడించారు.

Next Story