‘కంటోన్మెంట్‌కు రండి చూపిస్తా’.. కేటీఆర్‌, తలసానికి ఎమ్మెల్యే శ్రీగణేష్​సవాల్

by Gantepaka Srikanth |

కంటోన్మెంట్‌లో అభివృద్ది జరగలేదన్న కేటీఆర్ విమర్శలకు ఎమ్మెల్యే శ్రీగణేష్​కౌంటర్ ఇచ్చారు.

‘కంటోన్మెంట్‌కు రండి చూపిస్తా’.. కేటీఆర్‌, తలసానికి ఎమ్మెల్యే శ్రీగణేష్​సవాల్
X

దిశ, తెలంగాణ బ్యూరో: కంటోన్మెంట్‌లో అభివృద్ది జరగలేదన్న కేటీఆర్ విమర్శలకు ఎమ్మెల్యే శ్రీగణేష్​కౌంటర్ ఇచ్చారు. తన నియోజకవర్గ పరిధిలో ప్యారడైజ్​నుంచి బోయినపల్లి డైరీ ఫామ్​వరకూ నిర్మించబోయే ఎలివేటేడ్​కారిడార్‌కి నిధులకు పరిపాలన అనుమతులు వచ్చాయని, జేబీఎస్​నుంచి షామీర్​పేట్​వరకు నిర్మించతలపెట్టిన ఎలివేటేడ్​కారిడార్‌కి టెండర్లు పిలిచారని అభివృద్ధి పనులు త్వరలో ప్రారంభం కాబోతున్నాయన్నారు. సోమవారం గాంధీ భవన్​నిర్వహించిన మీడియా సమావేశంలో శ్రీగణేష్​మాట్లాడుతూ.. కంటోన్మెంట్​అభివృద్ధికి రూ.330 కోట్ల నిధులు సీఎం ఇచ్చారన్నారు.

తాను ఈ అభివృద్ధి పనుల వివరాలు చెప్పినందున కేటీఆర్, తలసాని శ్రీనివాస యాదవ్‌లు రాజీనామా చేయాలని డిమాండ్​చేశారు. వారి రాజీనామాలతో సిరిసిల్ల, సనత్​నగర్‌లకు ఉప ఎన్నికలు వస్తాయన్నారు. లేకపోతే కంటోన్మెంట్‌కు వచ్చి ముక్కును నేలకు రాయాలని శ్రీగణేష్ డిమాండ్ చేశారు. జూబ్లీహిల్స్​ఎన్నికల్లో గెలవాలని అబద్ధాలు కేటీఆర్ అడుతున్నారని, ఆయన తండ్రి అప్పుల అప్పారావు సినిమాలోని హీరో ప్రతి విషయంలో అప్పులు చేసినట్లుగా అప్పులు చేసి మిగులు రాష్ట్రంగా ఉన్న తెలంగాణను అప్పుల కుప్పగా మార్చారని, ఆయన కుమారుడు ఎన్నికల్లో లబ్ధి కోసం అన్ని డ్రామాలు ఆడుతున్నారని శ్రీగణేష్ మండిపడ్డారు.

సీఎంగా ఉన్న కేసీఆర్ మంత్రులుగా ఉన్న కేటీఆర్, తలసాని శ్రీనివాస యాదవ్, మల్లారెడ్డిలు కంటోన్మెంట్‌ను నిర్లక్ష్యం చేశారని, ఏ సమస్యను కూడా పరిష్కరించలేదన్నారు. టిమ్స్ ఆసుపత్రిలో రంగులు వేయలేదని విమర్శలు చేస్తున్నారని, ఆ ఆసుపత్రి పనుల ప్రోగ్రెస్​రిపోర్టు తీసుకువచ్చాని, మిగిలిన 30 శాతం పనులు వచ్చే మార్చి వరకూ పూర్తి చేస్తామన్నారు. బీఆర్ఎస్​హాయాంలో పదేళ్లలో చేయని పనులు తాను ఎమ్మెల్యేగా వచ్చిన పదిహేను నెలల్లో చేశామని, ఇంకా అభివృద్ధి పనులు చేసి చూపిస్తామని శ్రీగణేష్ చెప్పారు. సిట్టింగ్ ఎమ్మెల్యేగా ఉన్న దివంగత నేత సాయన్న అంత్యక్రియలు అధికారికంగా నిర్వహించలేని బీఆర్ఎస్ నేతలు తమపై విమర్శలు చేయడం మానుకోవాలని ఆయన హితవు పలికారు. కంటోన్మెంట్‌కి వస్తే తాను చేసే అభివృద్ధి పనులు చూపెడతానని శ్రీగణేష్ తెలిపారు.

Next Story