- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
మతపరమైన స్థలాల్లో ప్రచారం.. బీఆర్ఎస్ నేతల పైన ఎన్నికల నిబంధనల ఉల్లంఘన ఆరోపణలు
మతపరమైన స్థలాల్లో ప్రచారం.. బీఆర్ఎస్ నేతల పైన ఎన్నికల నిబంధనల ఉల్లంఘన ఆరోపణలు కాంగ్రెస్ నాయకులు చేశారు.

దిశ, డైనమిక్ బ్యూరో: మతపరమైన స్థలాల్లో ప్రచారం.. బీఆర్ఎస్ నేతల పైన ఎన్నికల నిబంధనల ఉల్లంఘన ఆరోపణలు కాంగ్రెస్ నాయకులు చేశారు. జూబ్లీ హిల్స్ ఉప ఎన్నికలో భాగంగా ఎన్నికల నిబంధనలను అతిక్రమిస్తున్నారని బీఆర్ఎస్ నేతలపై షేక్ పేట్ తహసీల్దార్ కార్యాలయంలో తాజాగా ఎన్నికల అధికారికి కాంగ్రెస్ నాయకులు ఫిర్యాదు చేశారు. జూబ్లీ హిల్స్ ఉప ఎన్నికల ప్రచారంలో బీఆర్ఎస్ నేతలు ఓటర్లను ప్రలోభాలకు గురి చేస్తున్నారని ఈ సందర్భంగా కాంగ్రెస్ ఎమ్మెల్సీ అద్దంకి దయాకర్ ఆరోపించారు. మతపరమైన ఆలయాల్లో ఎన్నికల ప్రచారం చేస్తూ.. వాటిని బహిరంగగా సోషల్ మీడియా హ్యాండ్లీల్‌లో పోస్టులు పెడుతున్నారని తెలిపారు.అభ్యర్థి ఫోటోతో ఓటర్ స్లిప్ లను పంచుతూ ప్రచారం చేస్తున్నారని అన్నారు.
సొంత ఛానెల్, పేపర్‌లో విస్తృతంగా ప్రచారం చేస్తూ... ఎన్నికల ఖర్చులో చూపించడం లేదన్నారు. ఈ మేరకు ఆరోపణలకు సంబంధించిన ఆధారాలను, అధికారులకు అందించామని, చర్యలు తీసుకోవాలని అధికారులను కోరినట్లు తెలిపారు. బీఆర్ఎస్ నేతలు ఓటమిని ముందుగానే గుర్తించి, అడ్డదారులు తొక్కుతున్నారని చెప్పుకొచ్చారు. ఎన్ని కుట్రలు చేసినా..అడ్డదారులు తొక్కినా Jubilee Hills ByElection లో ఎగిరేది కాంగ్రెస్ జెండానేని ధీమా వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్సీ డాక్టర్ బల్మూర్ వెంకట్, ఎమ్మెల్యే గణేశ్, టీపీసీసీ మీడియా కన్వీనర్ సామ రామ్మోహన్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.






