- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
అతడిని 24 గంటల్లో అరెస్ట్ చేయాలి.. లేదంటే రాష్ట్ర బంద్‌కు పిలుపునిస్తాం: అయ్యప్ప సేవా సమితి
by Satheesh |
హిందు దేవుళ్లపై, అయ్యప్ప స్వామిపై భారత నాస్తిక సంఘం రాష్ట్ర అధ్యక్షుడు భైరి నరేష్ చేసిన వ్యాఖ్యలు తెలంగాణ వ్యాప్తంగా తీవ్ర దుమారం రేపుతున్నాయి.

X
దిశ, వెబ్‌డెస్క్: హిందు దేవుళ్లపై, అయ్యప్ప స్వామిపై భారత నాస్తిక సంఘం రాష్ట్ర అధ్యక్షుడు భైరి నరేష్ చేసిన వ్యాఖ్యలు తెలంగాణ వ్యాప్తంగా తీవ్ర దుమారం రేపుతున్నాయి. నరేష్ అయ్యప్ప స్వామిపై చేసిన వ్యాఖ్యల పట్ల అయ్యప్ప భక్తులు, మాలధారులు తీవ్రంగా మండిపడుతున్నారు. నాస్తికుల పేరుతో హిందుదేవుళ్లను కించపరుస్తున్నా నరేష్‌కు వ్యతిరేకంగా రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళనలు చేస్తున్నారు. అయ్యప్ప స్వామిని కించపరిచేలా వ్యాఖ్యలు చేసిన భైరి నరేష్, రాజేష్‌లను వెంటనే అరెస్ట్ చేయాలని.. వారిపై పీడీయాక్ట్ నమోదు చేయాలని డిమాండ్ చేస్తున్నారు. హిందువుల మనోభావాలను దెబ్బతీసేలా వ్యాఖ్యలు చేసిన నరేష్‌ను 24 గంటల్లో అరెస్ట్ చేయాలని.. లేకపోతే తెలంగాణ బంద్‌కు పిలుపునిస్తామని అయ్యప్ప సేవా సమితి హెచ్చరించింది.
Next Story






