- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
TG: సర్పంచ్ ఎన్నికలు రాబోతున్నాయి.. రెడీగా ఉండండి
by Gantepaka Srikanth |
తెలంగాణలో గ్రామ పంచాయతీలకు ఎన్నికలు రాబోతున్నాయని, ప్రతి గ్రామంలోని పార్టీ నాయకులు, కార్యకర్తలు ఓటర్స్ లిస్ట్ సరిగ్గా ఉన్నాయా లేదా సరిచూసుకోవాలని, టీపీసీసీ ఎలక్షన్ కమిషన్ కో-ఆర్డినేషన్ కమిటీ, చైర్మన్ పులిపాటి రాజేష్ కుమార్ స్పష్టం చేశారు.

X
దిశ, తెలంగాణ బ్యూరో: తెలంగాణలో గ్రామ పంచాయతీలకు ఎన్నికలు రాబోతున్నాయని, ప్రతి గ్రామంలోని పార్టీ నాయకులు, కార్యకర్తలు ఓటర్స్ లిస్ట్ సరిగ్గా ఉన్నాయా లేదా సరిచూసుకోవాలని, టీపీసీసీ ఎలక్షన్ కమిషన్ కో-ఆర్డినేషన్ కమిటీ, చైర్మన్ పులిపాటి రాజేష్ కుమార్ స్పష్టం చేశారు. ఈ మేరకు ఆయన శనివారం ఓ ప్రకటన విడుదల చేశారు. తెలంగాణ రాష్ట్ర ఎన్నికల కమిషన్ ఆదేశాల మేరకు జిల్లాలలో ప్రతి వార్డ్ ఆఫీసులలో నూతన ఓటర్లు జాబితాను ప్రచురించారని, దేశమంతటా ఓటు చోరీ గురుంచి చేర్చలు జరుగుతున్న సమయంలో కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు ఎలాంటి పొరపాటులు జరగకుండా నిరంతరం అప్రమంతంగా ఉండాలన్నారు. రిజర్వేషన్స్ ఖరారులో ఎటువంటి లోపాలు జరగకుండా పార్టీ నాయకులు వ్యవహరించాలని రాజేష్ కుమార్ చెప్పారు.
Next Story






