- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
అక్కడ అలా.. ఇక్కడ ఇలా
జీహెచ్ఎంసీలో 27 పట్టణ స్థానిక సంస్థల విలీనంతో సమస్యలు ఒక్కొక్కటిగా వ స్తున్నాయి. ఇప్పటికే భవన నిర్మాణ అనుమ తుల విషయంలో అయోమయం నెలకొన్న విషయం తెలిసిందే.

దిశ, తెలంగాణ బ్యూరో: జీహెచ్ఎంసీలో 27 పట్టణ స్థానిక సంస్థల విలీనంతో సమస్యలు ఒక్కొక్కటిగా వస్తున్నాయి. ఇప్పటికే భవన నిర్మాణ అనుమ తుల విషయంలో అయోమయం నెలకొన్న విషయం తెలిసిందే. ఇప్పుడు ప్రాపర్టీ టాక్స్ వసూలు చేయడంలో అధికారుల్లో గందరగోళం నెలకొన్నదనే చెప్పాలి. జీహెచ్ఎంసీ పరిధిలో రెంటల్ వాల్యూ ఆధారంగా ప్రా పర్టీ టాక్స్ వసూలు చేస్తున్నారు. 27 యూ ఎల్బీల్లో మాత్రం కాపిటల్ వాల్యూ (సబ్‌రిజిస్ట్రార్ రేటు) ఆధారంగా ప్రాపర్టీ టాక్స్ వసూలు చేస్తున్నారు. అయితే 27 యూఎల్బీలను జీహెచ్ఎంసీలో విలీనం చేయడం తో ఒకే ప్రాంతంలో రెండు రకాల ప్రాపర్టీ వసూలు చేయడంపై నగరవాసుల్లో అయో మయం నెలకొన్నది.
జీహెచ్ఎంసీ పరిధిలో..
జీహెచ్ఎంసీ పరిధిలో 19.49 లక్షల ప్రాపర్టీలు ఉన్నాయి. వీటిలో రెసిడెన్షియల్ 16.35 లక్షలు, నాన్ రెసిడెన్షియల్ 2.80 లక్షలు, మిక్స్డ్ 34 వేలు ఉన్నాయి. గతేడాదిలో రూ.2038.42 కోట్లు వసూలైంది. ఈసారి ఆర్థిక సంవత్సరం (2025-26) ఆస్తి పన్నును రూ.2,500 కోట్లు వసూలు చేయాలని జీహెచ్ఎంసీ నిర్ణయించింది. అ త్యధికంగా శేరిలింగంపల్లి సర్కిల్ తర్వా త జూబ్లీహిల్స్, ఖైరతాబాద్, చందానగర్, మూసాపేట్, బేగంపేట్ సర్కిళ్ల అధికారుల కు ప్రత్యేకంగా టార్గెట్లు నిర్ణయించారు. అ యితే ఇక్కడ రెంటల్ వాల్యూ యూనిట్ ఆ ధారంగా ప్రాపర్టీ టాక్స్ వసూలు చేస్తున్నా రు. దీంతో జీహెచ్ఎంసీ పరిధిలో శివారు ప్రాంతాల్లోని 27 మున్సిపాలిటీల్లో వసూ లు చేస్తున్న టాక్స్ కంటే తక్కువగానే ఉంద ని అధికారులు చెబుతున్నారు.
27 యూఎల్బీల్లో..
తెలంగాణ కోర్ అర్బన్ రీజియన్ (టీసీయూఆర్) పరిధిలోని 27 యూఎల్బీలను జీహెచ్ఎంసీలో విలీనం చేసిన విషయం తెలిసిందే. అయితే 27యూఎల్బీల్లో కాపిట ల్ వాల్యూ (సబ్‌రిజిస్ట్రార్ రేటు) ప్రాపర్టీ వ సూలు చేస్తున్నారు. దీంతో ఈ మున్సిపాలిటీల్లో జీహెచ్ఎంసీ పరిధిలో ఉన్న జూబ్లీహి ల్స్, బంజారాహిల్స్, శేరిలింగంపల్లి ప్రాం తాల కంటే ప్రాపర్టీ టాక్స్ ఎక్కువగానే ఉం టుందని అధికారులు చెబుతున్నారు. సీడీ ఎంఏ పరిధిలోని అన్ని మున్సిపాలిటీల్లో వసూలయ్యే ప్రాపర్టీ టాక్స్‌కు సమానంగా 27 మున్సిపాలిటీల్లో వసూలవుతుందని అ ధికారులు చెబుతున్నారు. గతేడాది సీడీఎం ఏ పరిధిలో సుమారు రూ.1100 కోట్లకుపైగా ప్రాపర్టీ టాక్స్ వసూలైంది. వీటిలో 27 మున్సిపాలిటీల నుంచే అత్యధికంగా వచ్చిందని అధికారులు చెబుతున్నారు.
ప్రస్తుతానికి వేర్వేరుగానే..
జీహెచ్ఎంసీ ఏరియాను తెలంగాణ కో ర్ అర్బన్ రీజియన్(టీసీయూఆర్) వరకు విస్తరించడంతో ప్రాపర్టీ టాక్స్ ద్వారా వచ్చే ఆదాయం భారీగా పెరిగే అవకాశముందని అధికారులు చెబుతున్నారు. అయితే జీ హెచ్ఎంసీ ఏరియాలో ఒకవిధంగా, 27 మున్సిపాలిటీల్లో మరో విధంగా ఉండడం తో అధికారుల్లో అయోమయం నెలకొన్న ది. ఇదిలా ఉంటే ప్రాపర్టీ టాక్స్ మార్పులు చేయకుండానే యథావిధిగానే కొనసాగిం చే అవకాశముందని అధికారులు చెబుతున్నారు. ఇంతకుముందు నిజామాబాద్ మున్సిపల్ కార్పొరేషన్‌లో సమీప గ్రామాల ను విలీనం చేసిన సందర్భంగా ఇలాంటి సమస్య ముందుకొచ్చిందని, అక్కడ రెండు ప్రాంతాల్లో వేర్వేరు విధానాల్లో ప్రాపర్టీ టాక్స్ వసూలు చేస్తున్నారని పురపాలకశాఖ అధికారులు చెబుతున్నారు.
ప్రాపర్టీ టాక్స్ అధ్యయనం
జీహెచ్ఎంసీ విస్తరించిన నేపథ్యంలో కొన్ని నూతన విధానాలను అమలు చేయడానికి దేశంలోని ఆయా మెట్రోపాలిటన్ నగరాల్లో జీహెచ్ఎంసీ అధికారులు అధ్యయనం చేశారు. ముఖ్యంగా ప్రాపర్టీ టాక్స్ విషయంలో ముంబయి, బెంగుళూరు, ఇతర ప్రాంతాల్లో కాపిటల్ వాల్యూ (సబ్ రిజిస్ట్రార్ రేటు) వసూలు చేస్తున్నారు. ఈ విధానాలను జీహెచ్ఎంసీ అధికారుల బృందం ఇప్పటికే అధ్యయనం చేయడంతోపాటు దీనికి సంబంధించిన రిపోర్టును రాష్ట్ర ప్రభుత్వానికి పంపించినట్టు తెలిసింది. విలీనం తర్వాత కొత్త విధానాన్ని అమలు చేస్తే జీహెచ్ఎంసీ ప్రాపర్టీ టాక్స్ ఆదాయం రూ.5వేల కోట్లకు పెరిగే అవకాశముందని అధికారులు చెబుతున్నారు. ప్రజలపై భారం వేయకుండా ఉన్న విధానాల్లో మార్పులు చేయాలనే యోచనలో ప్రభుత్వం ఉన్నట్టు సమాచారం.






