Bhatti Vikramarka: విద్యుత్ స్తంభాలపై కేబుల్ వైర్లు కట్.. భట్టి ఆదేశాలు

by Prasad Jukanti |   (  Updated:2025-08-19 09:47:40  IST  )

కేబుల్ ఆపరేటర్లకు ఏడాది సమయం ఇచ్చినా స్పందించలేదని భట్టి విక్రమార్క్ ఆగ్రహం వ్యక్తం చేశారు.

Bhatti Vikramarka: విద్యుత్ స్తంభాలపై కేబుల్ వైర్లు కట్.. భట్టి ఆదేశాలు
X

దిశ, డైనమిక్ బ్యూరో: విద్యుత్ స్తంబాలపై ఉన్న కేబుల్ వైర్లను యుద్ధప్రాతిపదికన తొలగించాలని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క (Bhatti Vikramarka) సంబంధిత అధికారులను ఆదేశించారు. విద్యుత్ వైర్లు తగిలి రామాంతపూర్ లో ఆరుగురు మృతి చెందిన ఘటన మరువక ముందే హైదరాబాద్ పాతబస్తీలోని బండ్లగూడ రోడ్డు వద్ద గణేష్ విగ్రహాన్ని మండపానికి తరలిస్తుండగా విద్యుత్ షాక్ తగిలి ఇద్దరు మృతి చెందారు. రామాంతపూర్ ఘటన జరగక ముందే మరో ఘటనలో ఇద్దరు చనిపోయిన నేపథ్యంలో విద్యుత్ శాఖ ఉన్నతాధికారులతో భట్టి విక్రమార్క సమీక్ష నిర్వహిచారు. స్తంభాలపై కేబుల్ వైర్లను తొలగించడంతో పాటు అనుమతులు లేని విద్యుత్ కనెక్షన్లను తొలగించాలని ఆదేశించారు. వైర్లు తొలగింపుకు ఏడాది సమయం ఇచ్చినా ఆపరేటర్లు స్పందించలేదని కేబుల్ వైర్ల మూలంగా ప్రజల ప్రణాలు పోతున్నాయన్నారు.

కేబుల్ తొలగింపు షురూ:

విద్యుత్ స్తంభాలపై వేలాడుతున్న ఇంటర్నెట్, కేబుల్ వైర్ల తొలగింపును టీజీఎస్పీసీడీఎల్ (TGSPDCL) బృందాలు మొదలు పెట్టాయి. దీంతో నగరంలో పలు చోట్ల ఇంటర్నెట్ సేవలకు అంతరాయం ఏర్పడినట్లు నెటిజన్లు ఫిర్యాదులు చేస్తున్నారు. ప్రస్తుతం చాలా మంది వర్క్ ఫ్రమ్ హోమ్ లో పని చేస్తున్నందున ఉన్నపలంగా ఇలా కేబుల్స్ కట్ చేయడం ద్వారా ఇబ్బందులు తలెత్తుతాయని నెటిజన్లు కామెంట్స్ చేస్తున్నారు. అన్ని శాఖలు సన్వయం చేసుకుని శాశ్వత పరిష్కారం చూపాలని నగర వాసులు కోరుతున్నారు.

Next Story