- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
Cable Wires: వైర్లు కట్ చేయొద్దు.. ఎస్పీడీసీఎల్‌తో కేబుల్ ఆపరేటర్ల చర్చలు సఫలం!
డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క ఆదేశాల మేరకు విద్యుత్ స్తంభాలపై అనుమతి లేని ఇంటర్నెట్, ఇతర కేబుల్స్‌ను భారీగా అధికారులు తొలగించారు.

దిశ, డైనమిక్ బ్యూరో: హైదరాబాద్‌లో ఇటీవల రామాంతాపూర్, బండ్లగూడ, తదితర ప్రాంతాల్లో విద్యుత్ షాక్‌ల కారణంగా ప్రజలు మరణించిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలోనే డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క ఆదేశాల మేరకు విద్యుత్ స్తంభాలపై అనుమతి లేని ఇంటర్నెట్, ఇతర కేబుల్స్‌ను భారీగా అధికారులు తొలగించారు. ఈ చర్యలతో ప్రజలు, ఇంటర్నెట్ ప్రొవైడర్లు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. దీంతో నగరంలో (Electricity Department) విద్యుత్ శాఖ వర్సెస్ కేబుల్ ఆపరేటర్లుగా మారింది. వైర్ల తొలగింపు ఆపకపోతే ఆందోళనకు దిగుతామని (Cable operators) కేబుల్ ఆపరేటర్లు ప్రభుత్వాన్ని హెచ్చరించారు. ఈ నేపథ్యంలోనే బుధవారం మరోసారి టీజీ ఎస్పీడీసీఎల్ సీఎండీతో కేబుల్ ఆపరేటర్ల జేఏసీ నేతలు చర్చలు జరిపారు. అనంతరం ఈ సమావేశంపై టీజీ ఇంటర్నెట్ ప్రొవైడర్ ప్రెసిడెంట్ సతీష్‌బాబు మీడియాతో మాట్లాడుతూ.. (TG SPDCL) టీజీ ఎస్పీడీసీఎల్ సీఎండీతో కేబుల్ ఆపరేటర్లు చర్చలు సఫలం అయినట్లు క్లారిటీ ఇచ్చారు. కేబుల్, ఇంటర్నెట్ వైర్లను కట్ చేయొద్దనే డిమాండ్‌కు ప్రభుత్వం సానుకూలంగా స్పందించిందని వెల్లడించారు. రన్నింగ్‌లో ఉన్న కేబుల్, ఇంటర్నెట్ వైర్లను ఒకే బంచింగ్ విధానంలో తీసుకురావాలని చెప్పినట్లు వెల్లడించారు. నగర సుందరీకరణకు మేము కూడా అంగీకరిస్తామని టీజీ ఇంటర్నెట్ ప్రొవైడర్ ప్రెసిడెంట్ సతీష్‌బాబు తెలిపారు.






