- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
రామంతాపూర్ ఘటనకు కేబుల్ వైర్లు కారణం కాదు.. ఆపరేటర్ల వివరణ
by Gantepaka Srikanth |
దిశ, వెబ్‌డెస్క్: హైదరాబాద్‌లోని టీఎస్‌ఎస్‌పీడీసీఎల్ కార్యాలయం ఎదుట కేబుల్ ఆపరేటర్లు(Cable Operators) ఆందోళన చేపట్టారు.

X
దిశ, వెబ్‌డెస్క్: హైదరాబాద్‌లోని టీఎస్‌ఎస్‌పీడీసీఎల్ కార్యాలయం ఎదుట కేబుల్ ఆపరేటర్లు(Cable Operators) ఆందోళన చేపట్టారు. రామంతాపూర్ ఘటన(Ramanthapur incident)ను కేబుల్ వైర్లు కారణం కాదని వివరణ ఇచ్చారు. కేబుల్ వైర్లలో విద్యుత్ ప్రసారం కాదన్నారు. సిటీలో కేబుల్ వైర్లు తొలగిస్తే లక్షలమంది ఉపాధి కోల్పోతారని చెప్పారు. వర్క్ ఫ్రమ్ హోం చేసేవాళ్లు ఇబ్బంది పడతారని అన్నారు. ఇదిలా ఉంటే.. రామంతాపూర్ ఘటనను రాష్ట్ర మానవ హక్కుల కమిషన్(HRC) సుమోటోగా స్వీకరించింది. ఐదుగురు ప్రాణాలు కోల్పోయిన ఘటనను సీరియస్‌గా తీసుకున్నది. ఘటనకు కారణాలు, బాధిత కుటుంబాలకు పరిహారంపై ప్రభుత్వాన్ని నివేదిక కోరింది. భద్రతా చర్యలపై విద్యుత్ శాఖను సైతం నివేదిక కోరింది. ఈనెల ఆగష్టు 22వ తేదీలోపు నివేదిక సమర్పించాలని టీఎస్‌ఎస్‌పీడీసీఎల్‌కు నోటీసులు జారీ చేసింది.
Next Story






