Action Plan : 99 డేస్ యాక్షన్ ప్లాన్‌కు కేబినెట్ సబ్ కమిటీ

by Ramesh Naini |

వివిధ శాఖల్లో అమలు చేయాల్సిన 99 రోజుల కార్యాచరణ ప్రణాళిక (99 డేస్ యాక్షన్ ప్లాన్) రూపొందించి అమలు చేయడానికి కేబినెట్ సబ్ కమిటీని ఏర్పాటు చేస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది.

Action Plan : 99 డేస్ యాక్షన్ ప్లాన్‌కు కేబినెట్ సబ్ కమిటీ
X

దిశ, తెలంగాణ బ్యూరో/ డైనమిక్ బ్యూరో: రాష్ట్రంలో పాలన మరింత సమర్థంగా సాగేందుకు ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. వివిధ శాఖల్లో అమలు చేయాల్సిన 99 రోజుల కార్యాచరణ ప్రణాళిక (99 డేస్ యాక్షన్ ప్లాన్) రూపొందించి అమలు చేయడానికి కేబినెట్ సబ్ కమిటీని ఏర్పాటు చేస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. అసెంబ్లీ సమావేశాలు ముగిసిన వెంటనే ఈ యాక్షన్ ప్లాన్‌ను ఖరారు చేసి అమలు దిశగా అడుగులు వేయనుంది. ఈ సబ్ కమిటీకి ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క మల్లు ఛైర్మన్‌గా వ్యవహరించనున్నారు. కమిటీ సభ్యులుగా మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి, మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు, మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి ఉన్నారు.

త్వరలో కమిటీ సమావేశం

ఈ కమిటీకి ప్రణాళిక శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ కన్వీనర్‌గా వ్యవహరిస్తారు. అవసరాన్ని బట్టి ఆర్థిక శాఖతో పాటు సంబంధిత శాఖల ప్రత్యేక ప్రధాన కార్యదర్శులు, కార్యదర్శులు కమిటీ సమావేశాలకు హాజరవుతారు. రాష్ట్ర అభివృద్ధిని వేగవంతం చేయడం, ప్రజలకు ఇచ్చిన హామీలను కాలపరిమితిలో అమలు చేయడం లక్ష్యంగా ఈ 99 రోజుల యాక్షన్ ప్లాన్‌ను అత్యంత ప్రాధాన్యతతో రూపొందించి, వేగంగా అమలు చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. త్వరలోనే కమిటీ సమావేశమై అన్ని శాఖలతో సమీక్ష జరిపి వివరమైన కార్యాచరణ ప్రణాళికను ఖరారు చేయనుంది.

Next Story