Cabinet Meeting: ఎల్లుండి తెలంగాణ కేబినెట్‌ భేటీ.. ప్రధాన అజెండా అదే!

by Kema Shiva Kumar |   (  Updated:2025-06-21 05:43:10  IST  )

ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి (CM Revanth Reddy) అధ్యక్షతన సోమవారం ఉదయం 11 గంటలకు సచివాలయం (Secretariat)లో కేబినెట్ సమావేశం నిర్వహించబోతున్నట్లుగా తెలుస్తోంది.

Cabinet Meeting: ఎల్లుండి తెలంగాణ కేబినెట్‌ భేటీ.. ప్రధాన అజెండా అదే!
X

దిశ, వెబ్‌డెస్క్: ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి (CM Revanth Reddy) అధ్యక్షతన సోమవారం ఉదయం 11 గంటలకు సచివాలయం (Secretariat)లో కేబినెట్ సమావేశం నిర్వహించబోతున్నట్లుగా తెలుస్తోంది. గోదావరి-బనకచర్ల (Godavari - Banakacharla) ప్రాజెక్ట్‌పై విపక్షాలు ప్రభుత్వంపై దుష్ప్రచారానికి తెరలేపిన నేపథ్యంలో ఈ భేటీకి ప్రధాన్యత నెలకొంది. సమావేశంలో ప్రధాన అజెండాగా బనకచర్ల ప్రాజెక్ట్‌పైనే ప్రధానంగా చర్చించబోతున్నట్లుగా తెలుస్తోంది.

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం (Andhra Pradesh Government) బనకచర్లకు సంబంధించి ప్రీ ఫీజిబిలిటీ రిపోర్టును సిడబ్ల్యూసీకి పంపిన విషయం, ప్రాజెక్టు లక్ష్యాలు, అంచానా వ్యయం, నీటి వినియోగ వివరాలను రాష్ట్ర నీటి పారుదల శాఖ అధికారులతో పూర్తి వివరాలు తెప్పించుకుని సమావేశంలో సహచర మంత్రులకు మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి (Uttam Kumar Reddy) వివరించనున్నారు. ఏపీ ప్రభుత్వం చేపట్టబోతున్న ప్రాజెక్ట్‌కు తెలంగాణ ప్రభుత్వం అభ్యతరం తెలుపుతూ.. కేంద్ర జలశక్తి మంత్రి సీఆర్ పాటిల్ కలిసిన అంశాలను కేబినెట్‌లో ప్రస్తవించనున్నారు. ఒకవేళ బనకచర్ల డీపీఆర్‌ (DPR)కు ఏకపక్షంగా సీడబ్ల్యూసీ ఆమోదం తెలిపితే.. న్యాయపరంగా ఎదుర్కోవాల్సిన వ్యూహాలు మంత్రివర్గ భేటీలో చర్చకు రానున్నట్లుగా తెలుస్తోంది. అదేవిధంగా స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణపై కూడా సమావేశంలో సమాలోచనలు చేసే చాన్స్ ఉంది.

Next Story