- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
అందెశ్రీ మరణంపై కేబినెట్ సంతాపం.. సీఎం రేవంత్ అధ్యక్షతన మంత్రివర్గ సమావేశం ప్రారంభం
ప్రముఖ సహజ కవి అందెశ్రీ మృతి పట్ల తెలంగాణ మంత్రివర్గం సంతాపం తెలిపింది.

దిశ, డైనమిక్ బ్యూరో: ప్రముఖ సహజ కవి అందెశ్రీ (Ande Sri) మృతి పట్ల తెలంగాణ మంత్రివర్గం సంతాపం తెలిపింది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధ్యక్షతన సోమవారం మధ్యాహ్నం ప్రారంభమైన కేబినెట్ సమావేశంలో అందెశ్రీకి నివాళులు అర్పించారు. అందెశ్రీ సేవలకు గుర్తుగా ‘అందెశ్రీ స్మృతివనం’ ఏర్పాటు, అలాగే ఆయన కుటుంబంలో ఒకరికి ప్రభుత్వ ఉద్యోగం ఇవ్వాలనే అంశాలపై ప్రభుత్వం అనుకూలంగా ఆలోచిస్తున్నట్లు తెలిసింది. ఈ మేరకు తుది నిర్ణయం కేబినెట్ తీసుకునే అవకాశాలు ఉన్నాయి.
ఈ సమావేశంలో స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణ ప్రధాన అజెండాగా నిలవనుంది. బీసీ రిజర్వేషన్ల అమలు, ఎన్నికల షెడ్యూల్ ఖరారు వంటి అంశాలపై లోతైన చర్చ జరగనున్నట్లు వర్గాలు వెల్లడిస్తున్నాయి. స్థానిక ఎన్నికలు ఎప్పుడు నిర్వహిస్తారన్న వివరాలను నవంబర్ 24 లోపు తెలియజేయాలని రాష్ట్ర హైకోర్టు ఇప్పటికే ఆదేశించిన నేపథ్యంలో ఈ రోజు కేబినెట్ భేటీకి కీలక ప్రాధాన్యం ఏర్పడింది. బీసీలకు 42 శాతం రిజర్వేషన్ల వ్యవహారంపై నేటి కేబినెట్ స్పష్టతనిస్తే రాష్ట్రంలో స్థానిక ఎన్నికల నగారా త్వరలో మోగే అవకాశం ఉంది.






