T Congress: సర్పంచ్ ఎలక్షన్స్ ముగియగానే.. నామినేటెడ్ పోస్టులపై మహేశ్‌ గౌడ్‌ గుడ్ న్యూస్

by Prasad Jukanti |

నామినేటెడ్ పదవులపై పీసీసీ చీఫ్ కీలక వ్యాఖ్యలు చేశారు.

T Congress: సర్పంచ్ ఎలక్షన్స్ ముగియగానే.. నామినేటెడ్ పోస్టులపై మహేశ్‌ గౌడ్‌ గుడ్ న్యూస్
X

దిశ, డైనమిక్ బ్యూరో: తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సమ్మిట్‍ గ్రాండ్ సక్సెస్ అయిందని ఈ సమ్మింట్‍తో రాష్ట్రానికి పెట్టుబడులు వెల్లువెత్తాయని పీసీసీ చీఫ్ మహేశ్ కుమార్ గౌడ్ అన్నారు. గ్లోబల్ సమ్మిట్ సక్సెస్ చూసి హరీశ్‍రావుకు గుబులు పట్టుకుందన్నారు. పదేళ్ల బీఆర్‍ఎస్ పాలనలో ఎన్ని పెట్టుబడులు వచ్చాయని ప్రశ్నించారు. ఇవాళ సీఎల్పీలో మహేశ్ కుమార్ గౌడ్ మీడియాతో చిట్ చాట్ నిర్వహించారు. భారత రాష్ట్ర సమితి పాలన.. మా రెండేళ్ల పాలనపై చర్చకు మేం సిద్ధంగా ఉన్నామన్నారు. గ్లోబల్ సమ్మిట్ వల్ల దేశ విదేశీ పెట్టుబడులు వచ్చాయని సీఎం రేవంత్ రెడ్డి విజన్‍, దూరదృష్టికి గ్లోబల్ సమ్మిట్ నిదర్శనం అన్నారు.

నెలాఖరులోపు కార్పొరేషన్‌ ఛైర్మన్ల పదవులు:

నెలాఖరులోపు కార్పొరేషన్‌ ఛైర్మన్లు, బోర్డు పదవులు భర్తీ చేస్తామని టీపీసీసీ చీఫ్‌ మహేశ్‌కుమార్‌ గౌడ్‌ అన్నారు. నూతన పీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్‍లు, ప్రచార కమిటీలు వస్తాయన్నారు. నిజామాబాద్ ఎమ్మెల్యేగా తాన పోటీ హై కమాండ్ నిర్ణయం అన్నారు. ప్రస్తుతం ఉన్న పీసీసీ పదవిలో సంతృప్తిగా ఉన్నట్టు చెప్పారు. ఫ్యూచర్ సిటీలో పార్టీ కోసం స్థలం కేటాయిస్తామన్నారు.

ఉద్యోగులపై హరీశ్ రావు స్పష్టమైన నిర్ణయం వెల్లడించాలని పదేళ్ల బీఆర్ఎస్ పాలనలో రాష్ట్రం అన్ని రంగాల్లో విధ్వంసం పాలైందన్నారు. తెలంగాణ భవిష్యత్‍కు గ్లోబల్ సమ్మిట్ సరికొత్త దశ అన్నారు. లావాదేవీల్లో తేడాల వల్లే కవిత విమర్శలు చేస్తున్నారని కవిత కారణంగా బీఆర్ఎస్ నేతల లూటీలు బయటకు వస్తున్నాయన్నారు. కవిత లూటీ వ్యాఖ్యలపై సీఎం విచారణ జరపాలన్నారు. పదేళ్ల బీఆర్ఎస్ పాలనలో కంటే ప్రజాపాలనలో నాలుగింతలు అభివృద్ది, సంక్షేమం జరుగుతున్నదన్నారు. గ్లోబల్ సమ్మిట్‍కి రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ, మల్లికార్జున ఖర్గే విషెస్ తెలిపారని చెప్పారు. ఫోర్త్ సిటీ చారిత్రాత్మకం అని అన్ని రంగాల పరంగా హబ్ ఫ్యూచర్ సిటీ అన్నారు. దేశం చూపు తెలంగాణ వైపు మళ్లిందని చెప్పారు. సీఎం రేవంత్ రెడ్డి నేతృత్వంలో రెండేళ్ల పాలనలో అభివృద్ధి, సంక్షేమం ఎజెండాగా సుపరిపాలన అందిస్తున్నామని మెట్రో ఫేజ్ తో పాటు మూసీ సుందరీకరణ చేపడుతామన్నారు.

గ్రామ సర్పంచ్ ఏకగ్రీవ ఎన్నిక సాధారణ విషయం కాదని స్థానిక సంస్థల ఎన్నికలపై మంత్రులు ప్రత్యేక దృష్టి పెట్టారన్నారు. స్థానిక సంస్థల ఎన్నికలు ప్రశాంతంగా జరుగుతున్నాయన్నారు. వందేమాతరం విషయంలో రాజకీయ లబ్ధి కోసం ప్రధాని చవకబారు మాటలు మాట్లాడుతున్నారని ప్రియాంక గాంధీ చరిత్రను మరోసారి గుర్తు చేశారన్నారు. వందేమాతరం ఆచరించింది కాంగ్రెస్ పార్టీ అని చెప్పారు. EVM కాంగ్రెస్ హయంలో ప్రవేశ పెట్టినప్పటికీ ట్యాంపరింగ్ మాత్రం బీజేపీ హయాంలో ఓట్ చోరీ 100 శాతం జరుగుతుందని ఆరోపించారు. నెహ్రూ విజన్ వల్లే నేడు దేశం ఈ స్థితిలో ఉందని చెప్పారు.

Next Story