- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
కమలనాథుల్లో బై పోల్ కలవరం..! డిపాజిట్ కోసం ఆరాటం
ఎన్నికల్లో పోటీ చేస్తున్న ప్రతి రాజకీయ పార్టీ గెలుపే లక్ష్యంగా పని చేయడం సహజం. కానీ, జూబ్లీహిల్స్ బై ఎలక్షన్‌లో కమలం పార్టీ నేతల తీరు అందుకు విరుద్ధంగా ఉన్నట్లు ప్రచారం జరుగుతున్నది.

దిశ, తెలంగాణ బ్యూరో: ఎన్నికల్లో పోటీ చేస్తున్న ప్రతి రాజకీయ పార్టీ గెలుపే లక్ష్యంగా పని చేయడం సహజం. కానీ, జూబ్లీహిల్స్ బై ఎలక్షన్‌లో కమలం పార్టీ నేతల తీరు అందుకు విరుద్ధంగా ఉన్నట్లు ప్రచారం జరుగుతున్నది. డిపాజిట్ దక్కించుకోవడమే టార్గెట్ గా పెట్టుకుని కష్టపడుతున్నట్లు పార్టీ వర్గాల్లో టాక్ ఉన్నది. 2023 అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ అభ్యర్థికి డిపాజిట్ రాలేదు. ఇప్పుడు కూడా అదే పరిస్థితి వస్తుందేమోననే అనుమానం, భయం నేతలను వెంటాడుతున్నట్లు తెలుస్తున్నది. దీంతో ‘పార్టీ గెలవడం మాటేమో కానీ.. డిపాజిట్ వస్తే చాలు’ అనే తీరుగా లీడర్లు వ్యవహరిస్తున్నట్లు చర్చ జరుగుతున్నది.
డిపాజిట్ కోసం అష్టకష్టాలు
రాష్ట్రంలోని ఇతర ప్రాంతాలతో పోల్చుకుంటే గ్రేటర్ హైదరాబాద్ ఏరియాలో బీజేపీకి కాస్త పట్టు ఉన్నది. అందుకే 2019లో జరిగిన జీహెచ్ఎంసీ ఎన్నికల్లో మెజార్టీ కార్పొరేటర్లను ఆ పార్టీ గెలుచుకున్నది. సికింద్రాబాద్ లోక్ సభ స్థానం నుంచి కిషన్ రెడ్డి వరుసగా రెండు సార్లు ఎంపీగా విజయం సాధించారు. దీంతో జూబ్లీహిల్స్ బై ఎలక్షన్ లో బీజేపీ స్ట్రాంగ్ ఫైట్ ఇస్తుందని అందరూ ఆశించారు. కానీ క్షేత్రస్థాయిలో పరిస్థితులు అందుకు పూర్తి విరుద్ధంగా ఉన్నట్లు టాక్. 2023 అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేసిన దీపక్ రెడ్డికి డిపాజిట్ రాలేదు. ఇప్పుడు కూడా అదే సీన్ రిపీట్ అయ్యే చాన్స్ ఉందని చర్చ జరుగుతున్నది. ఈ విషయాన్ని గ్రహించిన ఆ పార్టీ నేతలు డిపాజిట్ దక్కించుకునేందుకు తీవ్రంగా కష్టపడుతున్నట్లు టాక్. అందుకోసమే కేంద్ర మంత్రులు కిషన్ రెడ్డి, బండి సంజయ్, ఎంపీలు, ఎమ్మెల్యేలు ఉదయం నుంచి సాయంత్రం వరకు ప్రచారం చేస్తున్నారు. ఒకవేళ ఈసారి కూడా డిపాజిట్ రాకపోతే జాతీయ స్థాయిలో ఓ వెలుగు వెలుగుతున్న పార్టీకి డిపాజిట్ కూడా రాలేదనే విమర్శలు ఎదుర్కోక తప్పదు.
కిషన్‌రెడ్డికి చాలెంజ్
బై ఎలక్షన్‌లో పార్టీ అభ్యర్థికి డిపాజిట్ రాకపోతే కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి తీవ్ర విమర్శలు ఎదుర్కోక తప్పదు. ఎందుకంటే పార్టీ తరుపున పోటీ చేస్తున్న దీపక్ రెడ్డి ఆయనకు అత్యంత సన్నిహితుడు. అందుకే ఆయనకు మరోసారి టికెట్ దక్కిందని రాజకీయవర్గాల్లో టాక్. దీపక్ రెడ్డికి టికెట్ ఇవ్వకుండా బీసీ సామాజిక వర్గానికి చెందిన లీడర్ కు టికెట్ ఇస్తే స్ట్రాంగ్ పైట్ ఉంటుందని నిజామాబాద్ ఎంపీ ధర్మపురి అర్వింద్ పబ్లిక్ గానే చెప్పారు. కానీ ఆయన సూచనలను పట్టించుకోకుండా.. కిషన్ రెడ్డి తన సన్నిహితుడికే టికెట్ ఇప్పించారు. అయితే ఇప్పుడు కనీసం డిపాజిట్ రాకపోతే కిషన్ రెడ్డి ఇంటా, బయటా విమర్శలు ఎదుర్కోక తప్పదు. అందుకే ప్రచార బాధ్యతలను తన భుజాల మీద వేసుకుని కిషన్ రెడ్డి పనిచేస్తున్నారని చర్చ జరుగుతున్నది.
20 శాతం ఓట్ల కోసం పోల్ మేనేజ్‌మెంట్!
డిపాజిట్ దక్కాలంటే నియోజకవర్గంలో పోలైన ఓట్లలో 17 శాతం ఓట్లు రావాలి. లేకపోతే ధరావతు దక్కదు. 2023 ఎన్నికల్లో బీజేపీకి 14.11 ఓట్లు వచ్చాయి. ఈసారి కనీసం 20 శాతం ఓట్లను సొంతం చేసుకోవాలని కమలం నేతలు టార్గెట్ పెట్టుకున్నట్లు తెలుస్తున్నది. అందుకోసం అవసరమైతే కొన్ని ఏరియాల్లో పోల్ మేనేజ్ మెంట్ సైతం చేయాలని ప్లాన్ చేస్తున్నట్లు తెలిసింది. కాంగ్రెస్, బీఆర్ఎస్ తో పోటీ పడి ఓటర్లను ఆకర్షించే ప్రయత్నాలు చేయకున్నా.. కనీసం అందులో సగమైన ముడుపులు ఇవ్వాలని భావిస్తున్నట్లు రాజకీయ వర్గాల్లో చర్చ జరుగుతున్నది.






