ఊపందుకోనున్న బై పోల్ ప్రచార పర్వం.. బీజేపీ స్టార్ క్యాంపెయినర్ల లిస్ట్ విడుదల

by Kema Shiva Kumar |

జూబ్లీహిల్స్ (Jubilee Hills) ఉప‌ఎన్నికకు నామినేషన్ల స్వీకరణ నేటితో ప్రక్రియ ముగిసింది.

ఊపందుకోనున్న బై పోల్ ప్రచార పర్వం.. బీజేపీ స్టార్ క్యాంపెయినర్ల లిస్ట్ విడుదల
X

దిశ, వెబ్‌డెస్క్: జూబ్లీహిల్స్ (Jubilee Hills) ఉప‌ఎన్నికకు నామినేషన్ల స్వీకరణ నేటితో ప్రక్రియ ముగిసింది. ఇక ప్రధాన పార్టీల ప్రచార పర్వం ఊపందుకోనుంది. ఈ నేపథ్యంలోనే భారతీయ జనతా పార్టీ (బీజేపీ) అభ్యర్థి లంకల దీపక్‌రెడ్డి (Lankala Deepak Reddy) తరఫున ప్రచారం చేసేందుకు మొత్తం 40 మందితో కూడిన ప్రముఖుల జాబితాను బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి అరుణ్ సింగ్ (Arun Singh) విడుదల చేశారు. ఈ జాబితాలో కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్, రాజస్థాన్ ముఖ్యమంత్రి భజన్‌లాల్ శర్మ, బీజేపీ మహిళా విభాగం అధ్యక్షురాలు వనపాళి నర్మథారావు, కేంద్ర మంత్రులు కిషన్‌రెడ్డి, బండి సంజయ్‌, ఇతర ప్రముఖులు ఉన్నారు.



Next Story