- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
పార్టీ మారిన ఎమ్మెల్యేల స్థానాల్లో త్వరలోనే ఉపఎన్నికలు
తెలంగాణలో పార్టీ మారిన పది మంది ఎమ్మెల్యేలపై సుప్రీం కోర్టు తీర్పునకు అనుగుణంగా వారి శాసన సభ సభ్యత్వాలు రద్దు కావడం తథ్యమని, వారి స్థానాల్లో మరికొద్ది నెలల్లో ఉపఎన్నికలు రాబోతున్నాయని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ స్పష్టం చేశారు.

పార్టీ మారిన ఎమ్మెల్యేల స్థానాల్లో త్వరలోనే ఉపఎన్నికలు
- కాంగ్రెస్ నాయకులు యూరియాను బ్లాక్ మార్కెట్ లో అమ్ముకుంటున్నారు
- 563 గ్రూప్-1 ఉద్యోగాలను రూ.1700 కోట్లకు అమ్ముకున్న దొంగలు
- ఆరు గ్యారంటీలు అమలు చేయడంలో ప్రభుత్వం విఫలం
- గద్వాల బహిరంగ సభలో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్
దిశ, గద్వాల ప్రతినిధి : తెలంగాణలో పార్టీ మారిన పది మంది ఎమ్మెల్యేలపై సుప్రీం కోర్టు తీర్పునకు అనుగుణంగా వారి శాసన సభ సభ్యత్వాలు రద్దు కావడం తథ్యమని, వారి స్థానాల్లో మరికొద్ది నెలల్లో ఉపఎన్నికలు రాబోతున్నాయని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ స్పష్టం చేశారు. రేవంత్ రెడ్డికి దమ్ముంటే పార్టీ మారిన శాసన సభ్యుల స్థానాల్లో ఉపఎన్నికలు నిర్వహించే ధైర్యం ఉందా అని సవాల్ విసిరారు. శనివారం గద్వాల నియోజకవర్గ ఇంచార్జ్ బాసు హనుమంతు నాయుడు ఆధ్వర్యం లో జిల్లా కేంద్రంలోని తెరుమైదానంలో ఏర్పాటు చేసిన బహిరంగ సభ లో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సభలో మాజీ మున్సిపల్ చైర్మన్ కేశవ్ తో పాటు పలువురు మాజీ కౌన్సిలర్లు, ధరూర్ మాజీ జడ్పీటీసీ పద్మ వెంకటేశ్వర్ రెడ్డి దంపతులతో పాటు మాజీ ఎంపీటీసీ లు, మాజీ సర్పంచ్ లకు కేటీఆర్ గులాబీ కండువా కప్పి బీఆర్ఎస్ పార్టీలోకి ఆహ్వానించారు. ముందుగా గద్వాల పట్టణంలో కేటీఆర్ కు ఘన స్వాగతం పలికారు. బీఆర్ ఎస్ కార్యకర్తలు నగరంలో భారీ ర్యాలీ చేపట్టారు. అనంతరం ఏర్పాటు చేసిన బహిరంగ సభలో కేటీఆర్ మాట్లాడుతూ.. తెలంగాణ లో కాంగ్రెస్ ప్రభుత్వం 22 నెలలు అధికారంలోకి వచ్చి అన్ని వర్గాలను మోసం చేసిందని, రైతులకు యూరియా అందించక కాంగ్రెస్ నాయకులు రైతులకు ఇవ్వాల్సిన యూరియా ను బ్లాక్ మార్కెట్ కు తరలించి అమ్ముకుంటున్నారని కేటీఆర్ విమర్శించారు. గద్వాల ఎమ్మెల్యే కృష్ణ మోహన్ రెడ్డి ఏ పార్టీలో ఉన్నాడో చెప్పుకోలేక పోతున్నాడని, మీడియా ముందు ఒక మాట, స్పీకర్ ముందు ఒక మాట మాట్లాడుతూ తాను బీఆర్ఎస్ పార్టీలోనే ఉన్నా అని అబద్ధాలు చెబుతున్నాడని, బీఆర్ఎస్ పార్టీలోనే ఎమ్మెల్యే ఉంటే గద్వాలలో జరుగుతున్న బీఆర్ఎస్ పార్టీ సభకు ఎమ్మెల్యే ఎందుకు ముఖం చాటేసారని ప్రశ్నించారు. అభివృద్ధి కోసమే పార్టీ మారారని ఎమ్మెల్యే కృష్ణ మోహన్ రెడ్డి అంటుంటే ఎవరి అభివృద్ధి కోసం నియోజక వర్గ అభివృద్ధి కోసమా.. లేక నీ సొంత అభివృద్ధి కోసం పార్టీ మారావో ప్రజలకు చెప్పాలని ఆయన డిమాండ్ చేశారు. కేసీఆర్ ప్రభుత్వంలోనే జోగులాంబ జిల్లా ఏర్పడిందని, ఈ జిల్లాకు మెడికల్ కళాశాల, నర్సింగ్ కళాశాల, గట్టు లిఫ్ట్ ప్రాజెక్ట్, తుమ్మిళ్ల ఎత్తిపోతల పథకాన్ని, డబుల్ బెడ్ రూమ్ ల నిర్మాణం చేపట్టడం జరిగిందని తెలిపారు. కాంగ్రెస్ ప్రభుత్వంలో ఏ ఒక్క వర్గం బాగుపడలేదని, ఆరు గ్యారంటీలను అమలు చేస్తామని చెప్పి ప్రజలను మోసం చేసిందన్నారు. గద్వాల పట్టణంలో కేసీఆర్ ప్రభుత్వంలో కట్టిన డబల్ బెడ్ రూమ్ లను కలర్ మార్చి మూడు రంగులు వేసి ముగ్గురు మంత్రులు ప్రారంభించారని రంగులు మార్చినంత మాత్రాన అవి కేసీఆర్ ప్రభుత్వం చేసిన అభివృద్ధి కాకుండా పోదని అన్నారు. తెలంగాణ రాష్ట్రంలో 10 లక్షల ఎకరాలకు సాగునీరు అందించి సకాలం లో రైతు బంధు ఇచ్చి రైతులకు యూరియా అందుబాటులో ఉండేదని, కరోనా కాలం లో కూడా కేసీఆర్ రైతుల పథకాలను ఆపలేదని తెలిపారు. తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన వెంటనే రెండు లక్షల ఉద్యోగాలను భర్తీ చేస్తామని చెప్పి అధికారంలోకి వచ్చి రెండు సంవత్సరాలైనా గతంలో కేసీఆర్ ప్రభుత్వం ఇచ్చిన ఉద్యోగాలకు ఈ ప్రభుత్వం ఉత్తర్వులు ఇచ్చిందే కానీ కొత్తగా ఉద్యోగ నోటిఫికేషన్ ఇవ్వలేదని ఎద్దేవా చేశారు. తెలంగాణ రాష్ట్రంలో గ్రూప్-1 ఉద్యోగాలలో అవకతవకలు జరిగాయని కోర్ట్ మరోసారి పరీక్ష పెట్టాలని తీర్పు ఇవ్వడం దానికి నిదర్శనమని, కాంగ్రెస్ నాయకులు గ్రూప్ -1 ఉద్యోగాలను ఒక్క ఉద్యోగం మూడు కోట్లకు అమ్ముకున్నారని, మొత్తం 563 ఉద్యోగాలకు గాను కాంగ్రెస్ నాయకులు రూ.1700 కోట్లకు పైగా దండుకొన్నారన్నారన్నారు. ఇథనాల్ ఫ్యాక్టరీకి వ్యతిరేకంగా పోరాడి జైలుకు వెళ్లిన పెద్ద ధన్వాడ రైతులకు బీఆర్ఎస్ పార్టీ అండగా ఉంటుందని, వెంటనే ప్రభుత్వం ఇథనాల్ ఫ్యాక్టరీ అనుమతులు రద్దు చేయాలని ఆయన డిమాండ్ చేశారు. కార్యక్రమంలో ఏం ఎల్ సి లు చాలా వెంకట్రామి రెడ్డి, నవీన్ కుమార్, శాసన హుజురాబాద్ ఎమ్మెల్యే పౌడి కౌశిక్ రెడ్డి, అలంపూర్ ఎమ్మెల్యే విజయుడు , మాజీ మంత్రులు నిరంజన్ రెడ్డి, శ్రీనివాస్ గౌడ్,లక్ష్మ రెడ్డి మాజీ శాసన సభ్యులు అల వెంకటేశ్వర్ రెడ్డి , రాజేందర్ రెడ్డి, అంజయ్య యాదవ్, జైపాల్ యాదవ్, ఆర్ ఎస్ ప్రవీణ్ కుమార్, ఆంజనేయులు గౌడ్, విజయ కుమార్ తదితరులు పాల్గొన్నారు.






