TG: ప్రజాభవన్‌లో బుల్లెట్ ప్రూఫ్ బాత్రూమ్‌లు

by Gantepaka Srikanth |   (  Updated:2025-11-07 12:03:19  IST  )

ప్రజా భవన్‌పై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి(CM Revanth Reddy) తీవ్ర విమర్శలు చేశారు.

TG: ప్రజాభవన్‌లో బుల్లెట్ ప్రూఫ్ బాత్రూమ్‌లు
X

దిశ, వెబ్‌డెస్క్: ప్రజా భవన్‌పై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి(CM Revanth Reddy) కీలక వ్యాఖ్యలు చేశారు. శుక్రవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. కేసీఆర్ భయస్తుడు అని కామెంట్ చేశారు. కేసీఆర్ సీఎంగా ఉన్నప్పుడు ఢిల్లీలో ఏ భవనంలో అయితే ఉన్నాడో.. ఇప్పుడు నాకు కూడా అదే భవనం ఇచ్చారు.. ఆ బిల్డింగ్ డోర్ల దగ్గర నుంచి బాత్రూముల వరకూ అన్నీ బుల్లెట్ ప్రూఫే అని అన్నారు. ప్రజాభవన్ పరిస్థితి ఏంటని భట్టి విక్రమార్కను అడిగితే.. ఇక్కడ కూడా అదే పరిస్థితి ఉందని చెప్పారు. మెయిన్ డోర్ల దగ్గర నుంచి బాత్రూమ్ డోర్ల వరకు ప్రజాభవన్‌లో కూడా బుల్లెట్ ప్రూఫ్‌ పెట్టించుకున్నారని ఎద్దేవా చేశారు.

తమకు ప్రజల మీద నమ్మకం ఉందని.. జూబ్లీహిల్స్‌లో తప్పకుండా గెలుస్తాము.. వారిలాగా చేయని పనులు చెప్పుకునే మనస్తత్వం తమది కాదని అన్నారు. చేసిన పనులే చెప్పుకుని ఓట్లు అడుగుతామని అన్నారు. 2047 నాటికి స్వాతంత్ర్యం వచ్చి వందేళ్లు కావస్తోంది. భవిష్యత్‌ ప్రణాళికలు ఎలా ఉండాలో విజన్‌ డాక్యుమెంట్‌ తయారు చేస్తున్నామని అన్నారు. హైదరాబాద్‌ అభివృద్ధిని కిషన్‌రెడ్డి, కేటీఆర్‌ ఇద్దరూ కలిసి అడ్డుకుంటున్నారని విమర్శించారు. వీరిద్దరూ కలిసి మెట్రో విస్తరణ, మూసీ ప్రక్షాళన, రీజినల్‌ రింగ్‌ రోడ్డు, ఫ్యూచర్‌సిటీని అడ్డుకుంటున్నారు. గోదావరి జలాలు 20 టీఎంసీలు హైదరాబాద్‌ నగరానికి తేవాలని ప్రయత్నిస్తుంటే అడ్డుకుంటున్నారు. హైదరాబాద్‌లో నిర్మించాలనుకున్న ఫ్లైఓవర్లు, అండర్‌ పాస్‌లు, ఎలివేటెడ్‌ కారిడార్లకు అడ్డంకులు సృష్టిస్తున్నారు. జూబ్లీహిల్స్‌ ఓటర్లు బుద్ధి చెప్పాక వీరిలో కూడా మార్పు వస్తుందని ఆశిస్తున్నట్లు తెలపారు.

Read More... హీరోయిన్లతో ఎలా గడిపారో అందరికీ తెలుసు: CM రేవంత్ హాట్ కామెంట్స్

ప్రైవేటు కాలేజీలకు సీఎం రేవంత్ వార్నింగ్

Next Story