- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
KTR : గుజరాత్‌కు బుల్లెట్ ట్రైన్.. తెలంగాణకు మెట్రో ట్రైన్ ఇవ్వలేరా? : కేటీఆర్
బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్(KTR) మరోసారి కేంద్ర ప్రభుత్వంపై తీవ్ర వ్యాఖ్యలు చేశారు.

దిశ, వెబ్ డెస్క్ : బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్(KTR) మరోసారి కేంద్ర ప్రభుత్వంపై తీవ్ర వ్యాఖ్యలు చేశారు. హైదరాబాద్ మెట్రో 2nd ఫేజ్(Hyderabad Metro 2nd Phase) విస్తరణపై కేంద్ర ప్రభుత్వం విస్మరించడం పట్ల నరేంద్ర మోడీ ప్రభుత్వంపై ఫైర్ అయ్యారు. రూ.2 లక్షల కోట్లు ఖర్చుతో గుజరాత్(Gujarat)కు బుల్లెట్ ట్రైన్ ప్రాజెక్టు(Bullet Train Project) మంజూరు చేసినపుడు, తెలంగాణకు కనీసం మెట్రో ట్రైన్ ప్రాజెక్టు కూడా ఇవ్వలేరా అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు.
కేంద్ర ప్రభుత్వంలో తెలంగాణ నుంచి ఇద్దరు కేంద్ర మంత్రులున్నారని, పార్లమెంటులో 8 మంది ఎంపీలు ఉన్నారని.. మరి వీరంతా ఏం చేస్తున్నట్టని ప్రశ్నించారు. వీరంతా తెలంగాణ అభివృద్ధి కోసం, ప్రాజెక్టుల కోసం పని చేయాల్సింది పోయి, ఎవరికి ఊడిగం చేస్తున్నారని నిలదీశారు. కాగా బుధవారం జరిగిన కేంద్ర కేబినెట్ లో హైదరాబాద్ మెట్రో 2వ దశ నిర్మాణ పనులకు ఎలాంటి అనుమతులు రాని విషయం తెలిసిందే.






