- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
‘తెలంగాణలో ఎంత ఘోరమైన పరిస్థితి ఉందో మీరే చూడండి’
ముఖ్యమంత్రి కేసీఆర్, బీఆర్ఎస్ సర్కార్‌పై బీఎస్పీ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ తీవ్ర వ్యాఖ్యలు చేశారు.

దిశ, వెబ్‌డెస్క్: ముఖ్యమంత్రి కేసీఆర్, బీఆర్ఎస్ సర్కార్‌పై బీఎస్పీ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ తీవ్ర వ్యాఖ్యలు చేశారు. సంక్షేమ హాస్టల్ సమస్యలపై స్పందిస్తూ.. ట్విట్టర్ వేదికగా ప్రభుత్వంపై అసహనం వ్యక్తం చేశారు. ‘‘నిన్న SC మరియు ST సంక్షేమ హాస్టళ్ల వార్డెన్‌లు చాలా మంది నన్ను కలిసిండ్రు. గత ఆరు నెలల నుండి వాళ్లకు డైట్(పిల్లల ఆహారానికి) బిల్లులు రాలేదంట. వార్డెన్లు అప్పులు చేసి పిల్లలకు తిండి పెడుతున్నారంటే తెలంగాణలో ఎంత ఘోరమైన పరిస్థితి ఉన్నదో చూడండి. పై అధికారులను అడిగితే బడ్జెట్ లేదంటున్నరట! ముఖ్యమంత్రి గారు, కేవలం అంబేద్కర్ గారి విగ్రహం పెట్టి ప్రచారం చేసుకుంటేనే సరిపోదు సారూ, పేద పిల్లలు ఆయన లాగా తయారు కావడానికి కావలసిన చదువు, వసతులు కూడా ఇవ్వండి.’’ అంటూ సోషల్ మీడియాలో పోస్టు పెట్టారు.
నిన్న SC మరియు ST సంక్షేమ హాస్టళ్ల వార్డెన్‌లు చాలా మంది నన్ను కలిసిండ్రు.
— Dr.RS Praveen Kumar (@RSPraveenSwaero) April 20, 2023
గత ఆరు నెలల నుండి వాళ్లకు డైట్(పిల్లల ఆహారానికి) బిల్లులు రాలేదంట! వార్డెన్లు అప్పులు చేసి పిల్లలకు తిండి పెడుతున్నరంటే తెలంగాణ లో ఎంత ఘోరమైన పరిస్థితి ఉన్నదో చూడండి.
పై అధికారులనడిగితే బడ్జెట్…






