- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
Brutal Murder: రాష్ట్రంలో మరో సంచలనం.. మహిళ దారుణ హత్య
ఓ మహిళను అత్యంత కిరాతకంగా హతమార్చిన భయానక ఘటన పెద్దపల్లి జిల్లా (Peddpally District)లో చోటుచేసుకుంది.

దిశ, వెబ్‌డెస్క్: ఓ మహిళను అత్యంత కిరాతకంగా హతమార్చిన భయానక ఘటన పెద్దపల్లి జిల్లా (Peddpally District)లో చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళితే.. రామగిరి (Ramagiri) మండల పరిధిలోని కల్వచర్ల (Kalvacharla) శివారులో ఓ మహిళ దారుణ హత్యకు గురైంది. గుర్తు తెలియని దండగులు హత్య అనంతరం మృతదేహాన్ని గ్రామ శివారులో పడేసి అక్కడి నుంచి పరారయ్యారు. ఈ మేరకు మృతదేహాన్ని గుర్తించిన స్థానికులు హుటాహుటిన రామగిరి పోలీసులకు (Ramagiri Police) సమాచారం అందజేయగా.. వారు ఘటనా స్థలానికి చేరుకుని హత్య జరిగిన ప్రాంతాన్ని క్షుణ్ణంగా పరిశీలించారు. అనంతరం అక్కడున్న ప్రాథమిక ఆధారాలను (Basic Evidence) సేకరించారు. అయితే, మహిళను సిమెంట్ ఇటుకతో దుండగులు బలంగా కొట్టి చంపినట్లుగా పోలీసులు నిర్ధారించారు. మృతురాలు మంచిర్యాల జిల్లా (Manchiryala District) ఐబీ తాండూరు (IB Tandoor) గ్రామానికి చెందిన మహిళగా గుర్తించారు. ఈ మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లుగా రామగిరి పోలీసులు వెల్లడించారు.






