- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
BRSV: బస్‌పాస్ చార్జీలను తగ్గించాల్సిందే.. బస్‌భవన్ ఎదుట బీఆర్ఎస్‌వీ మెరుపు ధర్నా.. అరెస్ట్
విద్యార్థులు, జనరల్ బస్‌పాస్‌ల (bus pass charges) చార్జీలను తాాజాగా తెలంగాణ ఆర్టీసీ పెంచిన దాదాపు దాదాపు 20 శాతం విషయం తెలిసిందే.

దిశ, డైనమిక్ బ్యూరో: విద్యార్థులు, జనరల్ బస్‌పాస్‌ల (bus pass charges) చార్జీలను తాాజాగా తెలంగాణ ఆర్టీసీ పెంచిన దాదాపు దాదాపు 20 శాతం విషయం తెలిసిందే. దీంతో ప్రజలు, విద్యార్థులు ప్రభుత్వంపై తీవ్ర ఆగ్రహంతో ఉన్నట్లు తెలుస్తోంది. ఈ మేరకు పెంచిన బస్ పాస్ చార్జీలను తగ్గించాలని డిమాండ్ చేస్తూ.. బీఆర్ఎస్‌వీ మంగళవారం హైదరాబాద్‌లోని బస్‌భవన్ (Bus Bhavan) ఎదుట మెరుపు ధర్నాకు దిగింది. రాష్ట్ర అధ్యక్షుడు గెల్లు శ్రీనివాస్ యాదవ్ ఆధ్వర్యంలో నిరసన ఉద్రిక్తతకు దారితీసింది. (BRSV) బీఆర్ఎస్‌వీ శ్రేణులు, బీఆర్ఎస్‌వీ అధ్యక్షుడు గెల్లు శ్రీనివాస్ యాదవ్‌తో సహా పలువురిని పోలీసులు అరెస్ట్ చేసి అదుపులోకి తీసుకున్నారు.
ఆర్టీసీ బస్సు చార్జీలు పెంచడం వల్ల పేద విద్యార్థులపై ఆర్థిక భారం పడుతుందని, ఒక్కో విద్యార్థిపై రూ. 250 నుంచి రూ. 350 వరకు భారం పడుతోందని ఈ సందర్బంగా బీఆర్ఎస్‌వీ నాయకులు తెలిపారు. (KCR) కేసీఆర్ ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో విద్యార్థులపై ఈ విధమైన భారం ఏది విధించలేదన్నారు. మహిళలకు ఉచిత బస్సు సౌకర్యం, ఒకవైపు బస్సులను పెంచకపోవడం, మరోవైపు టికెట్ చార్జీలు పెంచడంతో విద్యార్థులు తీవ్ర ఇబ్బందులకు గురి అవుతున్నారని, విద్యార్థులపై ఆర్థిక భారాన్ని రేవంత్ సర్కార్ మోపుతోందని మండిపడ్డారు. పెంచిన బస్ పాస్ చార్జీలను వెంటనే రద్దు చేయాలని కాంగ్రెస్ ప్రభుత్వాన్ని బీఆర్ఎస్‌వీ నాయకులు డిమాండ్ చేశారు.






