కేసీఆర్ సిట్ విచారణ.. బీఆర్ఎస్‌వీ నేతలు అరెస్ట్

by Naga Rani Yarlagadda |

తెలంగాణలో ప్రకంపనలు సృష్టించిన ఫోన్ ట్యాపింగ్ కేసులో (Phone Tapping Case) నేడు బీఆర్ఎస్ అధ్యక్షుడు, మాజీ సీఎం కేసీఆర్ (KCR SIT Enquiry) ను సిట్ అధికారులు నందినగర్ నివాసంలో విచారిస్తున్నారు.

కేసీఆర్ సిట్ విచారణ.. బీఆర్ఎస్‌వీ నేతలు అరెస్ట్
X

దిశ, వెబ్‌డెస్క్: తెలంగాణలో ప్రకంపనలు సృష్టించిన ఫోన్ ట్యాపింగ్ కేసులో (Phone Tapping Case) నేడు బీఆర్ఎస్ అధ్యక్షుడు, మాజీ సీఎం కేసీఆర్ (KCR SIT Enquiry) ను సిట్ అధికారులు నందినగర్ నివాసంలో విచారిస్తున్నారు. ఈ క్రమంలో బీఆర్ఎస్ నేతలు, బీఆర్ఎస్ విద్యార్థి విభాగం నిరసనలకు దిగారు. హైదరాబాద్ లోని మినిస్టర్ క్వార్టర్స్ వద్ద బీఆర్ఎస్ శ్రేణుల ఆందోళన ఉద్రిక్తతకు దారితీసింది. కేసీఆర్ సిట్ విచారణను నిరసిస్తూ.. బీఆర్ఎస్ విద్యార్థి విభాగం నేతలు నల్ల జెండాలతో మినిస్టర్ క్వార్టర్స్ ను ముట్టడించి సీఎం డౌన్ డౌన్ అంటూ నినాదాలు చేశారు. అక్కడే ధర్నాకు దిగారు. ఆ ప్రాంతంలో భారీగా మోహరించిన పోలీసులు.. బీఆర్ఎస్‌వీ అధ్యక్షుడు గెల్లు శ్రీనివాస్, తుంగ బాలును అరెస్ట్ చేశారు. మినిస్టర్ క్వార్టర్స్ లోపలికి వెళ్లేందుకు ప్రయత్నించిన విద్యార్థి నాయకుల్ని అడ్డుకున్నారు. మరోవైపు కేసీఆర్ సిట్ విచారణ నేపథ్యంలో ఆయన ఇంటి చుట్టూ పోలీసులు నాలుగంచెల భద్రతను ఏర్పాటు చేశారు. ఐదుగురు డీసీపీలు బందోబస్త్ నిర్వహిస్తుండగా.. ఆ చుట్టు పక్కల ప్రాంతాలకు బీఆర్ఎస్ శ్రేణులు భారీగా తరలివస్తున్నారు. రాష్ట్రవ్యాప్తంగా నిరసనలకు బీఆర్ఎస్ పిలుపునివ్వడంతో నేతలు, కార్యకర్తలు బైక్ ర్యాలీలు నిర్వహించి నిరసనలు చేస్తున్నారు.

Next Story