- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
ఇంటర్‌బోర్డును ముట్టడించిన BRSV
ఇంటర్ బోర్డును తీసివేసి ప్లస్ టూ విధానాన్ని అమలు చేయాలని అనుకుంటున్న ప్రభుత్వ నిర్ణయానికి వ్యతరేకంగా బీఆర్ఎస్‌వీ నాయకులు ధర్నాకు దిగారు. ఇంటర్ బోర్డు కార్యాలయం ముందు బైటాయించి సీఎం రేవంత్ రెడ్డికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు.

దిశ, వెబ్ డెస్క్: ఇంటర్ బోర్డును తీసివేసి ప్లస్ టూ విధానాన్ని అమలు చేయాలని అనుకుంటున్న ప్రభుత్వ నిర్ణయానికి వ్యతరేకంగా బీఆర్ఎస్‌వీ నాయకులు ధర్నాకు దిగారు. ఇంటర్ బోర్డు కార్యాలయం ముందు బైటాయించి సీఎం రేవంత్ రెడ్డికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. ఇంటర్ బోర్డు కార్యాలయంలోకి చొచ్చుకువెళ్లేందుకు ప్రయత్నించగా పోలీసులు వారిని అడ్డుకున్నారు. పలువురు బీఆర్‌ఎస్‌వీ నాయకులను అరెస్ట్ చేసి అదుపులోకి తీసుకున్నారు. ఎలాంటి ప్రణాళిక లేకుండా ప్లస్ టూ విధానం అమలు చేయడం విద్యార్థుల భవిష్యత్‌తో చెలగాటం ఆడటమేనని అన్నారు.
ఇదిలా ఉంటే ఈ అకడమిక్ ఇయర్ నుండే ప్లస్ టూ విద్యాబోధన అమలు చేసేందుకు ప్రభుత్వం కసరత్తు చేస్తోంది. దీని కోసం దేశవ్యాప్తంగా పైలెట్ పద్దతిలో 100 ప్రభుత్వ స్కూల్స్ ఎంపిక చేసి 11వ తరగతి అడ్మిషన్లు తీసుకుని, విద్యాబోధన చేయాలని నిర్ణయానికి వచ్చినట్టు సమాచారం. ఇప్పటికే అందుకోసం కావాల్సిన విధివిధానాలను తయారు చేయాలని విద్యాశాఖ అధికారులను సీఎం రేవంత్ రెడ్డి ఆదేశించినట్టు తెలుస్తోంది. ప్రకటించిన ఇంటర్ అడ్మిషన్ల షెడ్యూల్ ను కూడా అధికారులు వాయిదా వేసినట్టు తెలుస్తోంది. ఈ క్రమంలో కొందరు దీనిని ప్రశంసిస్తుంటే మరికొందరు మాత్రం వ్యతిరేకిస్తున్నారు.






