మిస్ వరల్డ్ పోటీదారుల పర్యటనపై బీఆర్ఎస్ ది అనవసర రాద్దాంతం

by Naga Rani Yarlagadda |

మిస్ వరల్డ్ పోటీదారుల ములుగు, రామప్ప దేవాలయ పర్యటనపై బీఆర్ఎస్ చేస్తున్న విమర్శలపై మంత్రి సీతక్క (Minister Seetakka) తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. స్వార్థ రాజకీయాల కోసం ప్రతి అంశాన్ని వక్రీకరించడం బీఆర్ఎస్‌ (BRS)కు పరిపాటిగా మారిందని ఆమె మండిపడ్డారు.

మిస్ వరల్డ్ పోటీదారుల పర్యటనపై బీఆర్ఎస్ ది అనవసర రాద్దాంతం
X
  • తెలంగాణ సెంటిమెంట్ తో రాష్ట్ర ప్రతిష్ట దిగజార్చొద్దు
  • బీఆర్ఎస్ పై మంత్రి సీతక్క తీవ్ర ఆగ్రహం

దిశ, తెలంగాణ బ్యూరో: మిస్ వరల్డ్ పోటీదారుల ములుగు, రామప్ప దేవాలయ పర్యటనపై బీఆర్ఎస్ చేస్తున్న విమర్శలపై మంత్రి సీతక్క (Minister Seetakka) తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. స్వార్థ రాజకీయాల కోసం ప్రతి అంశాన్ని వక్రీకరించడం బీఆర్ఎస్‌ (BRS)కు పరిపాటిగా మారిందని ఆమె మండిపడ్డారు. తెలంగాణ సెంటిమెంట్‌ను అడ్డుపెట్టుకుని రాష్ట్ర ప్రతిష్ఠను దిగజార్చవద్దని ఆమె హితవు పలికారు. ఈ సందర్భంగా మంత్రి సీతక్క గురువారం సెక్రటేరియేట్లో మాట్లాడుతూ, బుధవారం మిస్ వరల్డ్ (Miss World) పోటీదారుల వరంగల్ వేయి స్తంభాల గుడి, రామప్ప గుడి (Ramappa Temple) వద్ద హెరిటేజ్ వాక్ పర్యటన విజయవంతం కావడం చూసి బీఆర్ఎస్ నేతలు కళ్లల్లో నిప్పులు పోసుకున్నారన్నారు. కోడిగుడ్డు మీద ఈకలు పీకే ప్రయత్నం చేస్తున్నారని, ఇవాంక ట్రంప్ (Ivanka Trump) వచ్చినప్పుడు తోక పట్టుకుని తిరిగిన నాయకుడు ఎలాంటి సంస్కృతి సంప్రదాయాలు పాటించారో అందరికీ తెలుసు అంటూ విమర్శించారు. గిరిజన సంప్రదాయంలో గుళ్లలోకి కాళ్లు కడుక్కుని వెళ్లడం ఆచారమని, అదే అక్కడ పాటించారని ఆమె స్పష్టం చేశారు.

అందులో ఒక ఈవెంట్ మేనేజ్‌మెంట్ అమ్మాయి కాళ్లకు నీళ్లు పోసిందని, దానిని పట్టుకుని ప్రభుత్వం చేసిందని బంధనం చేస్తున్నారని మండిపడ్డారు. తెలంగాణ ప్రభుత్వం కాళ్లు కడిగితే అందరి కాళ్లు కడిగించాలి కదా? దీనిని ప్రభుత్వానికి అంటగట్టడం సిగ్గు అనిపించడం లేదా? కవితమ్మ కాళ్ల దగ్గర కలెక్టర్‌ను కూర్చోబెట్టినప్పుడు, కేసీఆర్ కలెక్టర్లతో కాళ్లు మొక్కించుకోవడం మీ దురహంకారం కాదా? దానికి వ్యతిరేకంగానే కదా ప్రజలు మిమ్మల్ని పక్కన పెట్టారు" అని ఆమె ప్రశ్నించారు. తెలంగాణ ఆత్మగౌరవం గురించి మాట్లాడే అర్హత బీఆర్ఎస్‌కు లేదని, ఆ పార్టీ తమ పేరులో నుంచి తెలంగాణ పేరును తీసేసిందని ఆమె విమర్శించారు. సబితా ఇంద్రారెడ్డి ములుగుపై పచ్చి అబద్ధాలు చెబుతున్నారని, ఆమె మంత్రిగా ఉన్నప్పుడు ఏం మానవత్వం చూపించారో అందరికీ తెలుసని ఆమె అన్నారు. ఇప్పటికైనా అబద్ధాలకు అంబాసిడర్‌గా సబితమ్మ మారకు అంటూ హితవు పలికారు. అధికారం పోయాక ప్రజలు, ఆత్మగౌరవం మీకు గుర్తుకు వచ్చాయా? అని మంత్రి నిలదీశారు.

Next Story