బీఆర్ఎస్ హయాంలోనే రైతు రాజులా బ్రతికాడు: కేటీఆర్

by Naga Rani Yarlagadda |

బీఆర్ఎస్ హయాంలోనే రైతు రాజులా బ్రతికాడని, రైతన్నలకు ఎలాంటి కష్టం లేకుండా చూసుకున్నామని ఆ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అన్నారు.

బీఆర్ఎస్ హయాంలోనే రైతు రాజులా బ్రతికాడు: కేటీఆర్
X

దిశ, వెబ్‌డెస్క్: బీఆర్ఎస్ హయాంలోనే రైతు రాజులా బ్రతికాడని, రైతన్నలకు ఎలాంటి కష్టం లేకుండా చూసుకున్నామని ఆ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అన్నారు. మంగళవారం ఆదిలాబాద్ పత్తి మార్కెట్ యార్డును సందర్శించిన కేటీఆర్.. అనంతరం బోథ్ నియోజకవర్గం నేరడిగొండ జిన్నింగ్ మిల్లు వద్ద సోయాబీన్, మొక్కజొన్న పంటల కోనుగోలు కేంద్రాలను పరిశీలించారు. ఈ సందర్భంగా కేటీఆర్ మాట్లాడుతూ.. మళ్లీ బీఆర్ఎస్ పార్టీనే అధికారంలోకి వస్తుందని, రైతుల సమస్యలను పరిష్కరిస్తామని తెలిపారు. రైతులకు బీఆర్ఎస్ ఎప్పుడూ అండగా ఉంటుందని భరోసానిచ్చారు.

బీఆర్ఎస్ ప్రభుత్వంలో ప్రతి ఊరిలో కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేసి, ప్రతీ ధాన్యం గింజను కొన్నామన్నారు. ఇప్పుడున్న ప్రభుత్వంలో రైతును పట్టించుకునే నాథుడే కరువయ్యారని విమర్శించారు. పంట కొనే దిక్కులేక, పట్టించుకునేనాథుడు లేక రైతాంగం సంక్షోభంలో చిక్కుకుందని ఆవేదన వ్యక్తం చేశారు. కనీస మద్దతు ధర అందక దగా పడిన రైతులకు భరోసా ఇవ్వాలనే బీఆర్ఎస్ పోరాబాటకు సిద్ధమైందన్నారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల తీరుతో రాష్ట్రంలో రైతులు ఎదుర్కొంటున్న కష్టాలను అందరికీ తెలిసేలా చేస్తామన్నారు.

Next Story