- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
వివేక్, వంశీకృష్ణతో మాకు ప్రాణభయం: క్యాతనపల్లి బీఆర్ఎస్ కౌన్సిలర్లు
క్యాతనపల్లిలో మంత్రి వివేక్ ముందే మహిళా కౌన్సిలర్లను తాకరాని చోట తాకుతూ ఇబ్బందులు పెట్టారని.. మహిళా కమిషన్ సుమోటోగా తీసుకొని కాంగ్రెస్ నాయకులపై చర్యలు తీసుకోవాలని బీఆర్ఎస్ మహిళా నేతలు డిమాండ్ చేశారు. మహిళలపై దాడులు చేయడన్ని ఖండిస్తూ మహిళా కమిషన్‌ను బుధవారం మాజీ ఎమ్మెల్యే గొంగటి సునీత నేతృత్వంలో వినతిపత్రం అందజేశారు.

దిశ, తెలంగాణ బ్యూరో: క్యాతనపల్లిలో మంత్రి వివేక్ ముందే మహిళా కౌన్సిలర్లను తాకరాని చోట తాకుతూ ఇబ్బందులు పెట్టారని.. మహిళా కమిషన్ సుమోటోగా తీసుకొని కాంగ్రెస్ నాయకులపై చర్యలు తీసుకోవాలని బీఆర్ఎస్ మహిళా నేతలు డిమాండ్ చేశారు. మహిళలపై దాడులు చేయడన్ని ఖండిస్తూ మహిళా కమిషన్‌ను బుధవారం మాజీ ఎమ్మెల్యే గొంగటి సునీత నేతృత్వంలో వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. మంత్రి వివేక్ కనుసన్నల్లో అధికారులు పనిచేస్తున్నారని.. మహిళలపై కాంగ్రెస్ కౌన్సిలర్లు దాడులు చేస్తుంటే పోలీసులు ప్రేక్షక పాత్ర వహించారని ఆరోపించారు. కుట్రపూరితంగా చైర్మన్ ఎన్నిక వాయిదా వేశారన్నారు. మళ్లీ ఎన్నికల కమిషన్ చైర్మన్ ఎన్నిక తేదీ ప్రకటించే వరకు కౌన్సిలర్లకు రక్షణ కల్పించాలని కోరారు.
క్యాతనపల్లి మున్సిపల్ చైర్మన్ ఎన్నికలో 22 మంది కౌన్సిలర్ సభ్యులు ఉంటే ఎన్నిక వాయిదా వేశారని.. 17న మళ్లీ ఎన్నిక పెట్టినా బీఆర్ఎస్, సీపీఐ సంపూర్ణ మద్దతు తెలిపిందని చెప్పారు. మంత్రి వివేక్, ఎంపీ వంశీ కృష్ణ నానా రకాలుగా ఇబ్బందులు పెట్టారని.. తాకారాని చోట తగులుతూ మహిళా కౌన్సిలర్ల అని చూడకుండా ఇబ్బంది పెట్టారని ఆరోపించారు. 2 గంటలు ఒకే రూమ్‌లో పెట్టారని.. కనీసం తాగడానికి సైతం మంచి నీళ్లు ఇవ్వలేదన్నారు. కోరం ఉన్నా కావాలని ఎన్నిక వాయిదా వేశారని అన్నారు. మహిళా కమిషన్ సుమోటోగా తీసుకొని మహిళా కౌన్సిలర్ల రక్షణ కల్పించాలని అన్నారు. బీఆర్ఎస్ కౌన్సిలర్ స్వర్ణలత మాట్లాడుతూ.. బీఆర్ఎస్ కౌన్సిలర్లమని తమను టార్గెట్ చేశారని.. తాము క్యాతనపల్లి వెళ్తే బతుకనివ్వరని ఆందోళన వ్యక్తం చేశారు. కనీసం పిల్లలు ఎక్కడ ఉన్నారో.. తాము ఎక్కడ ఉన్నామో తెలియదని.. మంత్రి వివేక్, ఎంపీ వంశీ కృష్ణతో తమకు ప్రాణభయం ఉన్నదని అన్నారు.






