- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
నా చావుకు కేటీఆర్, వాళ్లే కారణం.. బీఆర్ఎస్ మహిళా కార్యకర్త సంచలన పోస్ట్
బీఆర్ఎస్ మాజీ కార్యకర్త ఆశప్రియ సోషల్ మీడియాలో తాను ఆత్మహత్య చేసుకుంటున్నానంటూ సంచలన పోస్ట్ చేశారు. బీఆర్ఎస్ సోషల్ మీడియా తనను వేధింపులకు గురి చేస్తుందని పేర్కొన్నారు. తన చావుకు PJMR ,HS మరియు KTR కారణం అంటూ పేర్కొన్నారు.

దిశ, వెబ్ డెస్క్: బీఆర్ఎస్ మాజీ కార్యకర్త ఆశప్రియ సోషల్ మీడియాలో తాను ఆత్మహత్య చేసుకుంటున్నానంటూ సంచలన పోస్ట్ చేశారు. బీఆర్ఎస్ సోషల్ మీడియా తనను వేధింపులకు గురి చేస్తుందని పేర్కొన్నారు. తన చావుకు PJMR ,HS మరియు KTR కారణం అంటూ పేర్కొన్నారు. కొన్ని గంటల్లో తన నుండి ఎలాంటి పోస్ట్ రాకుండా చనిపోయాననే అర్థం అని తెలిపారు. వేధింపులకు సంబంధించిన ఆధారాలు అన్నీ తన వాట్సాప్ సెల్ఫ్ చాట్‌లో ఉన్నాయని చెప్పారు. తనపై వేధింపులకు ఎవరు కారణం అనేది అక్కడ ఉంటుందని చెప్పారు. ఇదే తన మరణ వాంగ్మూలం అని కేసు పెడితే బీఆర్ఎస్ పార్టీ హైకోర్టుకు వెళ్లి బెయిల్ తీసుకువస్తుందని, అందుకే తాను చనిపోతున్నానని ఆవేదన వ్యక్తం చేశారు.
తనను ఒకరు ప్రశాంతంగా ఉండనివ్వడంలేదని తెలిపారు. దానికి ముందు సోషల్ మీడియాలో తనపై చేసిన కామెంట్లకు సంబంధించిన స్క్రీన్ షాట్స్‌ను ఆశప్రియ ట్విట్టర్ లో షేర్ చేశారు. కేటీఆర్ నువ్వు ఏం మనిషివి.. నీ మనుషులు ఏం మాట్లాడుతున్నారు నా గురించి అంటూ ప్రశ్నించారు. పార్టీలో ఉండే మహిళలతో నీకు సంబంధం ఉందని తన ఫోన్ లో చెప్పారని ఆరోపించారు. మాట్లాడిన సాక్ష్యాలు బయటపెట్టాలా అని ఏంది అని నిలదీశారు.
నాపై ఎవరు వేధింపులకు పాల్పడుతున్న పిల్ల జమిందార్‌ను నీకు తెలిసి కూడా పక్కన పెట్టుకుని ఫోటోలు దిగుతున్నావ్ అంటే, నువ్వే ఎంకరేజ్ చేస్తున్నావని అర్థం అంటూ ఆరోపించారు. ఇదిలా ఉంటే మహబూబ్‌నగర్ జిల్లాకు చెందిని ఆశప్రియ బీఆర్ఎస్ కార్యకర్తగా పార్టీలో ఎంతో చురుకుగా ఉండేవారు. సోషల్ మీడియాలో యాక్టివ్‌గా ఉంటూ పార్టీకి మద్దతుగా పోస్టులు చేసేశారు. అయితే ఏం జరిగిందో కానీ తరవాత పార్టీకి గుడ్ బై చెప్పారు. గతంలోనూ బీఆర్ఎస్ సోషల్ మీడియా తనను వేధింపులకు గురి చేస్తోందని ఆశప్రియ ఆత్మహత్యయత్నానికి పాల్పడ్డారు. ఇక తాజాగా ఆమె చేస్తున్న పోస్టులు హాట్ టాపిక్ గా మారాయి. LINK






