- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
పటాన్‌చెరు నియోజకవర్గంలో BRS పాగా.. మూడు మున్సిపాలిటీలకు చైర్మన్లు, వైస్ చైర్మన్లు ఖరారు
పటాన్‌చెరు నియోజకవర్గంలోని గుమ్మడిదల, జిన్నారం, గడ్డపోతారం మున్సిపాలిటీలను బీఆర్ఎస్ పార్టీ ఘనంగా కైవసం చేసుకుంది. నూతనంగా ఎన్నికైన చైర్మన్లు, వైస్ చైర్మన్లు బాధ్యతలు స్వీకరించి, నియోజకవర్గ అభివృద్ధికి కట్టుబడి ఉంటామని ప్రకటించారు.

దిశ, వెబ్‌డెస్క్: సంగారెడ్డి జిల్లా పటాన్‌చెరు (Patancheru) నియోజకవర్గంలో బీఆర్ఎస్ (BRS) పట్టు నిపుకుంది. తాజాగా జరిగిన మున్సిపల్ ఎన్నికల్లో గుమ్మడిదల, జిన్నారం, గడ్డపోతారం మున్సిపాలిటీలను ఆ పార్టీ క్లీన్‌స్వీప్ చేసింది. ఈ మూడు మున్సిపాలిటీల్లోనూ బీఆర్ఎస్ బలపరిచిన అభ్యర్థులే చైర్మన్, వైస్ చైర్మన్ పదవుల్లో కొలువుదీరబోతున్నారు. గుమ్మడిదల (Gummadidala) మున్సిపల్ చైర్మన్‌గా పాపని కుమార్ గౌడ్, వైస్ చైర్మన్‌గా చిమ్ముల సంధ్యా గోవర్ధన్ రెడ్డి ఎన్నికయ్యారు. మెజారిటీ కౌన్సిలర్ల మద్దతుతో వీరిద్దరూ పదవీ బాధ్యతలు స్వీకరించబోతున్నారు. ఇక జిన్నారం (Jinnaram) మున్సిపాలిటీలో చైర్మన్ పదవిని జనార్దన్ దక్కించుకోగా, వైస్ చైర్మన్‌గా ప్రతాప్ రెడ్డి ఎంపికయ్యారు. పారిశ్రామిక ప్రాంతమైన జిన్నారంలో బీఆర్ఎస్ గెలుపు ఆ పార్టీ శ్రేణుల్లో ఉత్సాహాన్ని నింపింది. చివరగా అత్యంత కీలకమైన గడ్డపోతారం (Gaddapotharam) మున్సిపాలిటీలో చైర్మన్‌గా గద్దె సుష్మ, వైస్ చైర్మన్‌గా మహేందర్ గౌడ్ ఎన్నికయ్యారు.
కాగా, పటాన్‌చెరు నియోజకవర్గంలోని మున్సిపాలిటీలను కైవసం చేసుకోవడంతో బీఆర్ఎస్ కార్యకర్తలు పెద్ద ఎత్తున సంబరాలు జరుపుకుంటున్నారు. బాణసంచా కాల్చి, స్వీట్లు పంపిణీ చేస్తూ తమ ఆనందాన్ని వ్యక్తం చేశారు. స్థానిక ఎమ్మెల్యే నాయకత్వంలో నియోజకవర్గంలో జరిగిన అభివృద్ధి పనులే ఈ విజయానికి కారణమని నూతనంగా ఎన్నికైన చైర్మన్లు పేర్కొన్నారు. ప్రజల నమ్మకాన్ని చూరగొనేలా మున్సిపాలిటీల అభివృద్ధికి కృషి చేస్తామని వారు అన్నారు.






