పదేళ్లలో రైల్వేలను BRS పట్టించుకోలే.. బండి సంజయ్ కీలక వ్యాఖ్యలు

by Kema Shiva Kumar |   (  Updated:2025-05-22 06:24:30  IST  )

పదేళ్ల కాలంలో రాష్ట్రంలో రైల్వేలను ఏనాడు బీఆర్ఎస్ ప్రభుత్వ (BRS Government) ఏనాడు పట్టించుకున్న పాపాన పోలేదని కేంద్ర మంత్రి బండి సంజయ్ (Bandi Sanjay) ఆరోపిచారు.

పదేళ్లలో రైల్వేలను BRS పట్టించుకోలే.. బండి సంజయ్ కీలక వ్యాఖ్యలు
X

దిశ, వెబ్‌డెస్క్: పదేళ్ల కాలంలో రాష్ట్రంలో రైల్వేలను ఏనాడు బీఆర్ఎస్ ప్రభుత్వ (BRS Government) ఏనాడు పట్టించుకున్న పాపాన పోలేదని కేంద్ర మంత్రి బండి సంజయ్ (Bandi Sanjay) ఆరోపిచారు. ఇవాళ దేశ వ్యాప్తంగా 18 రాష్ట్రాల్లో 103 అమృత్ భారత్ స్టేషన్లను ప్రధాని నరేంద్ర మోడీ (PM Nagendra Modi) వర్చువల్‌గా రాజస్థాన్‌ (Rajasthan)లోని బీకనీర్‌ (Bikaner)లోని పలానా పట్టణంలో ప్రారంభించారు. అయితే, బేగంపేట, కరీంనగర్, వరంగల్ అమృత్ స్టేషన్ల ప్రారంభోత్సవంలో భాగంగా కరీంనగర్‌లో కేంద్ర మంత్రి బండి సంజయ్‌తో పాటు రాష్ట్ర మంత్రులు పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి, పొన్నం ప్రభాకర్ పాల్గొన్నారు.

ఈ సందర్భంగా బండి సంజయ్ మాట్లాడుతూ.. కేంద్రంలో ఎన్డీఏ సర్కార్ (NDA Government) వచ్చిన తరువాత తెలంగాణ రైల్వేస్‌కు మహర్దశ పట్టిందన్నారు. పదేళ్ల పాటు అధికారంలో ఉన్న నాడు బీఆర్ఎస్ ప్రభుత్వం రైల్వేలను కనీసం పట్టించుకున్న పాపాన పోలేదని కామెంట్ చేశారు. దేశ వ్యాప్తంగా మొత్తం 1,300 రైల్వే స్టేషన్లను ఆధునికరించామని పేర్కొన్నారు. ఇక రూ.27 కోట్లతో కరీంనగర్ రైల్వే స్టేషన్ డెవలప్ చేశామని తెలిపారు. త్వరలోనే అమృత్ భారత్ పథకంలో భాగంగా జమ్మికుంట (Jammikunta) రైల్వే స్టేషన్‌ను అభివృద్ధి చేస్తామని అన్నారు. ఇకపై కరీంనగర్ నుంచి ప్రముఖ పుణ్యక్షేత్రం తిరుపతికి వారానికి 4 రోజులు నడిపేలా ఇండియన్ రైల్వేస్‌ (Indian Railways)తో చర్చించి చర్యలు తీసుకుంటామని బండి సంజయ్ అన్నారు.

Next Story