- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
వచ్చే ఎన్నికల నాటికి రాష్ట్రంలో బీఆర్ఎస్ కనుమరుగు.. టీపీసీసీ చీఫ్ హాట్ కామెంట్స్
వచ్చే ఎన్నికల నాటికి రాష్ట్రంలో బీఆర్ఎస్ (BRS) పార్టీ కనుమరుగవ్వడం ఖాయమని టీపీసీసీ చీఫ్ మహేశ్ కుమార్ గౌడ్ (Mahesh Kumar Goud) అన్నారు.

దిశ, వెబ్‌డెస్క్: వచ్చే ఎన్నికల నాటికి రాష్ట్రంలో బీఆర్ఎస్ (BRS) పార్టీ కనుమరుగవ్వడం ఖాయమని టీపీసీసీ చీఫ్ మహేశ్ కుమార్ గౌడ్ (Mahesh Kumar Goud) అన్నారు. ఇవాళ ఆయన నిజామాబాద్ (Nizamabad)లో మీడియాతో మాట్లాడుతూ.. ఇటీవల కాలంలో గులాబీ నేతలు తమ ఉనికిని కాపాడుకునేందుకు ఆపసోపాలు పడుతున్నారని కామెంట్ చేశారు. బీఆర్ఎస్ పార్టీలో కవిత (Kavitha), కేటీఆర్ (KTR), హరీశ్ రావు (Harish Rao)ల మధ్య విబేధాలు మొదలై తారా స్థాయికి చేరాయని తెలిపారు. రాష్ట్రంలో ప్రతిపక్ష నేతగా ఉన్న కేసీఆర్‌కు ప్రజా సమస్యలపై పట్టింపు లేదని.. ఆ పార్టీలో ఉన్న నాయకులంతా అంతేనని ఫైర్ అయ్యారు.
మంత్రి కొండా సురేఖ చేసిన వ్యాఖ్యలను కావాలనే కొందరు వక్రీకరిస్తూ సోషల్ మీడియా (Social Media)లో దుష్ప్రచారం చేస్తున్నారని ఆరోపించారు. అసత్య ప్రచారాలపై సైబర్ క్రైమ్ (Cyber Crime)లో ఫిర్యాదు చేస్తారని వార్నింగ్ ఇచ్చారు. ‘ఆపరేషన్ సిందూర్’ (Operation Sindoor) పేరుతో సాధించింది.. కోల్పోయింది ఏమిటో బీజేపీ నేతలకే తెలియాలన్నారు. మతం పేరిట రాజకీయాల్లో లబ్ధి పొందడం బీజేపీ (BJP)కి వెన్నతో పెట్టిన విద్య అంటూ సెటైర్లు వేశారు. త్వరలోనే రాజ్యాంగ పరిరక్షణ కోసం సంవిధాన్ బచావో కమిటీలతో పాటు.. 2026లో డీలిమిటేషన్ దృష్ట్యా పార్టీకి సలహాలు, సూచలను ఇచ్చేందుకు కమిటీలను వేస్తామని మహేశ్ కుమార్ గౌడ్ స్పష్టం చేశారు.






