మున్సిపల్ శాఖ మంత్రిగా రేవంత్ ఫెయిల్.. బీఆర్ఎస్ విప్ కేపీ వివేకానంద

by Ajay Maddhiboyina |

మున్సిపల్ శాఖ మంత్రిగా సీఎం ఫెయిల్ అయ్యారని అసెంబ్లీ బీఆర్ఎస్ విప్ కేపీ వివేకానంద అన్నారు. బుధవారం ఆయన తెలంగాణ భవన్‌లో మీడియాతో మాట్లాడారు.

మున్సిపల్ శాఖ మంత్రిగా రేవంత్ ఫెయిల్.. బీఆర్ఎస్ విప్ కేపీ వివేకానంద
X

దిశ, తెలంగాణ బ్యూరో: మున్సిపల్ శాఖ మంత్రిగా సీఎం ఫెయిల్ అయ్యారని అసెంబ్లీ బీఆర్ఎస్ విప్ కేపీ వివేకానంద అన్నారు. బుధవారం ఆయన తెలంగాణ భవన్‌లో మీడియాతో మాట్లాడారు. స్వయంగా సీఎం రోడ్ల పైకి వస్తానని అంటున్నారని.. కానీ, ప్రజలకు ఏం అవసరమో గుర్తించడంలో ఘోరంగా విఫలం అయ్యారని పేర్కొన్నారు. తనే రాజు తనే మంత్రి అని చెప్పుకుంటున్న రేవంత్‌రెడ్డి ప్రజల అవసరాలు తీర్చడంలో రాజుగా, మంత్రిగా ఎందుకు సక్సెస్ కాలేకపోయారని ప్రశ్నించారు. రెండేళ్ల పాలనలో హైదరాబాద్ నగరంలో ఒక్కపని కూడా చేయలేదని ఆరోపించారు.

సెకండ్ ఫేజ్ మెట్రో విస్తరణలో భాగంగా అడుగు ముందుకు పడడం లేదని.. నార్త్ హైదరాబాద్‌కు మెట్రో డిమాండ్ ఉన్నా దానిపై చర్చ చేయడం లేదని పేర్కొన్నారు. మూసీ సుందరీకరణ పేరుతో హడావుడి చేసిన రేవంత్‌రెడ్డి, ఇప్పుడు ఏం మాట్లాడడం లేదన్నారు. అసలు మహానగరంపై అవగాహన ఉన్న మంత్రి కేబినెట్‌లో లేకుండాపోయారని తెలిపారు. ఎస్ఆర్‌డీపీ పనులపై సీఎంకు అవగాహన లేదన్నారు. జీహెచ్ఎంసీ విస్తరణ పచ్చి మోసమని.. పూర్తిగా అశాస్త్రీయ పద్ధతిలో మూడు ముక్కలు చేశారని పేర్కొన్నారు. ప్రజల అవసరాల కంటే ఆదాయం పైనే మక్కువ చూపిస్తున్నారని అన్నారు. జీహెచ్ఎంసీలో ఎన్నికలు ఎప్పుడు పెట్టినా కాంగ్రెస్‌కు గుణపాఠం తప్పదని హెచ్చరించారు.

Next Story