- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
MLC Election: బీఆర్ఎస్ ఓట్లు బీజేపీకి షిఫ్ట్!..కేసీఆర్ నిర్ణయంతో బీఆర్ఎస్ కు బిగ్ షాక్?
ఎమ్మెల్సీ ఎన్నికల్లో బీఆర్ఎస్ కు షాక్ గా మారిన కేసీఆర్ డెసిషన్

దిశ, డైనమిక్ బ్యూరో: తెలంగాణలో రెండు టీచర్, ఒక గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ స్థానానికి (MLC Election) జరిగిన ఎన్నికల పోరు ముగిసింది. ఈ మండలి పోరులో బీజేపీ జోరు కనబరిచింది. ఒక టీచర్, ఒక గ్రాడ్యుయేట్ సీట్లను కమలనాథులు కైవసం చేసుకున్నారు. టీచర్స్ ఎమ్మెల్సీ వ్యవహారం అలా ఉంచితే సర్వత్రా ఉత్కంఠ రేపిన పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో కాంగ్రెస్ సిట్టింగ్ స్థానాన్ని కాషాయ పార్టీ కైవసం చేసుకోవడం స్టేట్ పాలిటిక్స్‌లో ఆసక్తిగా మారింది. బీజేపీ నమోదు చేసుకున్న ఈ గెలుపుతో రాబోయే రోజుల్లో రాష్ట్ర రాజకీయాల్లో కీలక మలుపులు ఖాయం అనే టాక్ వినిపిస్తున్నది. కాంగ్రెస్ వర్సెస్ బీజేపీ మధ్య సాగిన పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో బీఆర్ఎస్ (BRS) ఓటు బ్యాంకు బీజేపీ వైపు మళ్లిందని రాజకీయ వర్గాల్లో జోరుగా చర్చ జరుగుతోంది.
కారు బలం కమలం వైపు మొగ్గు..
గ్రాడ్యుయేట్ ఎన్నికల్లో గెలుపు కోసం కాంగ్రెస్(Congress), బీజేపీ (BJP) తీవ్ర ప్రయత్నాలు చేయగా ఈ స్థానంలో క్షేత్రస్థాయిలో బలమైన ఓటు బ్యాంకు కలిగిన బీఆర్ఎస్ మాత్రం పోటీకి దూరంగా ఉండటం అందరినీ ఆశ్చర్యపరిచించింది. ప్రభుత్వంపై వ్యతిరేకత ఉందని నిత్యం ఆరోపణలు గుప్పిస్తున్న గులాబీ దళం.. ఈ రేసులో కనీసం అభ్యర్థిని దింపే సాహసం చేయకపోవడం సొంత పార్టీలోనూ చర్చకు దారి తీసింది. అయితే మెదక్-కరీంనగర్-నిజామాబాద్-ఆదిలాబాద్ గ్రాడ్యుయేట్ స్థానంలో మొత్తం 3,55,159 మంది ఓటర్లు ఉండగా ఈ జిల్లాల్లో బీఆర్ఎస్‌కు గట్టి ఓటు బ్యాంకు ఉంది. గతంలో ఉద్యమ కాలం నుంచి ఉత్తర తెలంగాణ బీఆర్ఎస్‌కు కొండంత అండగా నిలబడింది. ఈ సారి తమ పార్టీ అభ్యర్థి పోటీలో లేకపోవడంతో వారంతా బీజేపీ వైపు మళ్లారనే చర్చ జరుగుతోంది. కాంగ్రెస్ ఓట్లను ప్రసన్న హరికృష్ణ భారీగా చీల్చగా, బీఆర్ఎస్ ఓటు బ్యాంకు పెద్ద ఎత్తున బీజేపీకి షిఫ్ట్ అయినట్లు తెలుస్తోంది. ఓ సందర్భంలో బీసీ నినాదంతో బరిలోకి దిగిన ప్రసన్న హరికృష్ణ భార్యతో ఎమ్మెల్సీ కవిత భేటీ కావడం హాట్ టాపిక్‌గా మారింది. హరికృష్ణకు మద్దతు ఇవ్వాలని పార్టీ శ్రేణులకు ఇంటర్నల్‌గా కవిత సూచించినట్లు ప్రచారం జరిగింది. అయినా బీఆర్ఎస్ మద్దతుదారులు కమలం పార్టీ వైపే మొగ్గు చూపినట్లు రాజకీయ విశ్లేషకులు అంచనా వేస్తున్నారు.
కేసీఆర్ నిర్ణయంతో బీఆర్ఎస్‌కు డ్యామేజ్?
తాజా ఫలితాలు తెలంగాణ రాజకీయ ముఖ చిత్రంలో కొత్త సమీకరణాలకు తెరలేపే అవకాశాలు కనిపిస్తున్నాయి. బీఆర్ఎస్ పోటీకి దూరం కావడం వల్ల కాంగ్రెస్ పార్టీకి జరిగిన నష్టం కంటే బీఆర్ఎస్‌కు జరిగిన నష్టమే ఎక్కువ అనే టాక్ వినిపిస్తోంది. గులాబీ పార్టీ పోటీలో ఉంటే ఆ పార్టీ స్థానం ఏంటో తెలిసేది. కానీ పోటీకి దూరం కావడం వల్ల బీఆర్ఎస్ స్థానాన్ని బీజేపీ భర్తీ చేసేందుకు పూలబాటగా మారిందనే అభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి. తెలంగాణలో కాంగ్రెస్, బీఆర్ఎస్‌కు ప్రత్యామ్నాయం తామేనని, ఇక రాబోయేది తమ ప్రభుత్వమేనని బీజేపీ వ్యూహాత్మకంగా అడుగులు వేస్తున్నది. ఇటువంటి తరుణంలో బీఆర్ఎస్ పోటీకి దూరంగా ఉండడంతో గులాబీ పార్టీని బీజేపీ వెనక్కి నెట్టిందనే టాక్ వినిపిస్తోంది. ఇకనైనా కారు పార్టీ తేరుకోకపోతే రాష్ట్ర వ్యాప్తంగా ఆ పార్టీ స్థానాన్ని బీజేపీ భర్తీ చేయనున్నట్లు ప్రచారం జరుగుతున్నది.






