BRS: పోలీసులకే దిక్కులేదు, ప్రజలకు ఎవరు దిక్కు..? ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్

by Ramesh Goud |

ప్రజలకు రక్షణ ఇచ్చే పోలీసులకే దిక్కులేదని, ఇక ప్రజలకు దిక్కు ఎవరని బీఆర్ఎస్ నేత ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్(RS Praveen Kumar) అన్నారు.

BRS: పోలీసులకే దిక్కులేదు, ప్రజలకు ఎవరు దిక్కు..? ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్
X

దిశ, వెబ్ డెస్క్: ప్రజలకు రక్షణ ఇచ్చే పోలీసులకే దిక్కులేదని, ఇక ప్రజలకు దిక్కు ఎవరని బీఆర్ఎస్ నేత ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్(RS Praveen Kumar) అన్నారు. తెలంగాణ భవన్(Telangana Bhavan) మీడియా సమావేశంలో మాట్లాడిన ఆయన.. పోలీసుల ఆత్మహత్యల(Police Suicides)పై స్పందించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. గత బీఆర్ఎస్ హయాంలో(BRS Governance) తెలంగాణ శాంతిభద్రతల విషయంలో దేశానికే ఆదర్శంగా నిలిచిందని, కాంగ్రెస్ ప్రభుత్వం(Congress Government) వచ్చాక ఒక్క సంవత్సరంలోనే శాంతి భద్రతలు దారుణంగా క్షీణించాయని ఆరోపించారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన నాటి నుండి నేటి వరకు రాష్ట్రానికి హోం మంత్రి(Home Minister) లేడని విమర్శలు చేశారు. అలాగే ఆదివారం డీజీపీ(DGP) కొన్ని లెక్కలు మాత్రమే మీడియా ముందు పెట్టారని, రాష్ట్రంలో ఇంకా చాలా దారుణాలు జరుగుతున్నాయని అన్నారు.

డబ్బుల కోసం హత్యలు 40 శాతం పెరిగాయని, 82 శాతం 18 సంవత్సరాల లోపు ఉన్న మహిళలపై అత్యాచారాలు పెరిగాయని అన్నారు. ఆనాడు మహిళల భద్రత కోసం కేసీఆర్(KCR) షీ టీమ్స్(She Teams) పెట్టారని, ఇప్పుడు హోంమంత్రిగా ఉన్న ముఖ్యమంత్రి ఎక్కడికి పోయాడని ప్రశ్నించారు. అంతేగాక సైబర్ క్రైమ్(Cyber Crimes) కేస్‌లు 50 శాతం పెరిగాయని, సైబర్ క్రైమ్ పోలీసులు ఎక్కడ పోయారని, సైబర్ క్రైమ్ పోలీసులు కేవలం బీఆర్ఎస్ నాయకులు, సోషల్ మీడియా వాళ్ళ మీద మాత్రమే నిఘా పెట్టారు తప్ప బెట్టింగులు, లోన్ యాప్స్, డిజిటల్ అరెస్టులపై దృష్టి పెట్టడం లేదని అన్నారు. రాష్ట్రంలో పోలీసులే ధర్నా చేస్తున్న పరిస్థితి వచ్చిందని, పోలీసుల ఆత్మహత్యలు పెరిగాయని, వాటిపై ఎందుకు స్పందించడం లేదని నిలదీశారు. అసలు ముఖ్యమంత్రి అంతర్ భద్రతలో స్పెషల్ పోలీస్‌లను తీసివేసి ఏఆర్ వాళ్ళను పెట్టారని, దీనిపై ఎందుకు మాట్లాడడం లేదని మండిపడ్డారు. చట్టవ్యతిరేకమైన ఏ చర్యలను బీఆర్ఎస్ ప్రోత్సహించదని, ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తే కేస్‌లు పెట్టడం సరైన పద్దతి కాదని ఆర్ఎస్పీ చెప్పారు.

Next Story