- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
BRS: అలా జరిగితేనే అభివృద్ధి చెందుతున్నట్టు లెక్క
సీఎం రేవంత్ రెడ్డి నేతృత్వంలోని కాంగ్రెస్ ప్రభుత్వంపై బీఆర్ఎస్ పార్టీ తీవ్ర విమర్శలు చేసింది. ఈ మేరకు ఎక్స్ వేదికగా ఆసక్తికర ట్వీట్ పెట్టింది.

దిశ, వెబ్‌డెస్క్: సీఎం రేవంత్ రెడ్డి నేతృత్వంలోని కాంగ్రెస్ ప్రభుత్వంపై బీఆర్ఎస్ పార్టీ తీవ్ర విమర్శలు చేసింది. ఈ మేరకు ఎక్స్ వేదికగా ఆసక్తికర ట్వీట్ పెట్టింది. ‘‘జీఎస్టీ వసూళ్లు ప్రభుత్వాల పాలనతీరుకు ఒక గీటురాయి. ఒక రాష్ట్రం లేదా దేశ ఆర్థిక అభివృద్ధికి ఒక కొలమానం. ప్రజల కొనుగోలు సామర్థ్యానికి సూచిక. వ్యాపార, వాణిజ్య కార్యకలాపాలు ఏ స్థాయిలో ఉన్నాయో తెలియజెప్పే ప్రమాణం. జీఎస్టీ వసూళ్లు పెరిగితే ఆర్థికంగా అభివృద్ధి చెందుతున్నట్టు లెక్క.
కానీ.. రాష్ట్రంలో మాత్రం పూర్తిగా రివర్స్ అయింది. కాంగ్రెస్ పాలనలో ఆర్థికవృద్ధి అట్టర్ ప్లాప్‌గా నమోదైంది. కేసీఆర్ పాలనలో జీఎస్టీ వసూళ్లు రెండంకెల వృద్ధిరేటుతో రంకెలు వేశాయి. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన తర్వాత పురోగతి మాట దేవుడెరుగు.. మైనస్ వృద్ధిరేటుతో దేశంలోనే అట్టడుగు స్థాయికి తెలంగాణ పడిపోయింది.
2024 జనవరి మొదలు ప్రతినెలా ఆర్థిక రంగం క్రమంగా క్షీణిస్తూ వస్తున్నదని గణాంకాలే చెప్తున్నాయి. 2023తో పోల్చితే 2024 సెప్టెంబర్‌లో జీఎస్టీ వసూళ్ల వృద్ధి ఒక్కశాతమే నమోదైంది. ఈ ఏడాది ఏకంగా -5 శాతానికి పడిపోయింది’’ అని ట్వీట్‌లో బీఆర్ఎస్ పేర్కొంది.






