ఆర్ఆర్ఆర్ భూ బాధితులకు అండగా బీఆర్ఎస్

by Naga Rani Yarlagadda |

రీజనల్ రింగ్ రోడ్డు భూ బాధితులకు బీఆర్ఎస్ పార్టీ అండగా ఉంటుందని మాజీమంత్రి వి.శ్రీనివాస్‌గౌడ్ భరోసా ఇచ్చారు.

ఆర్ఆర్ఆర్ భూ బాధితులకు అండగా బీఆర్ఎస్
X
  • కాంగ్రెస్ ప్రభుత్వంపై ఒత్తిడి పెంచుతాం
  • మాజీమంత్రి వి.శ్రీనివాస్‌గౌడ్

దిశ, తెలంగాణ బ్యూరో: రీజనల్ రింగ్ రోడ్డు భూ బాధితులకు బీఆర్ఎస్ పార్టీ అండగా ఉంటుందని మాజీమంత్రి వి.శ్రీనివాస్‌గౌడ్ భరోసా ఇచ్చారు. గురువారం కల్వకుర్తి ట్రిపుల్ ఆర్, గ్రీన్ ఫీల్డ్ హైవే భూ బాధిత రైతులతో తెలంగాణ భవన్‌లో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ప్రభుత్వంపై ఒత్తిడి పెంచుతామన్నారు. కాంగ్రెస్ పార్టీ ఎప్పుడు అధికారంలో ఉన్నా ప్రజలకు ఇబ్బందులు తప్పవని చెప్పారు. ట్రిపుల్ ఆర్ అలైన్మెంట్‌ను కాంగ్రెస్ నేతలు ఇష్టారాజ్యంగా మారుస్తున్నారని.. పేద రైతుల భూములకు నష్టపరిహారం కూడా సరిగా ఇవ్వడం లేదని అన్నారు. అన్ని జిల్లాల ట్రిపుల్ ఆర్ రైతులు సంఘటితంగా పోరాడాలని పిలుపునిచ్చారు. త్వరలోనే బీఆర్ఎస్ తరఫున అలైన్మెంట్ మార్పునకు వ్యతిరేకంగా ఉద్యమ కార్యాచరణ ప్రకటిస్తామని వెల్లడించారు. మాజీ ఎమ్మెల్యే జైపాల్‌యాదవ్ మాట్లాడుతూ.. రైతులు సంఘటితంగా పోరాడితే ప్రభుత్వం కచ్చితంగా దిగొస్తుందన్నారు. ఈ సమావేశంలో మాజీ ఎమ్మెల్యే మర్రి జనార్దన్‌రెడ్డి పాల్గొన్నారు.

Next Story